KhammamPoliticsTelangana

వరి ధాన్యం కొనేదెప్పుడు : రామసాయం మాధవరెడ్డి

వరి ధాన్యం కొనేదెప్పుడు : రామసాయం మాధవరెడ్డి

సికే న్యూస్ ప్రతినిధి కూసుమంచి

పాలేరు ఐకెపిలో రైతాంగం వరి ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్న కాటా పెట్టనందుకు నిరసనగా రైతులు కాంగ్రెస్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రరోకో చేయటం జరిగింది ఈ సందర్భంగా వరి ధాన్యాన్ని వెంటనే కాటా పెట్టాలని కెసిఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన రాస్తారోకోన ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామసాయం మాధవరెడ్డి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కూసుమంచి సబ్ డివిజన్ కార్యదర్శి ఐ వెంకన్న మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ఐకెపి సెంటర్లో పోసి 20 రోజులు గడుస్తున్న కాటాలు పెట్టకపోవడం సిగ్గుచేటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు

ఇంత ఆలస్యం జరగటానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మందు చూపులేని కారణంగానే జరిగిందని రాత్రి కురిసిన వడగండ్ల వానకు ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని కోపోద్దేకులైనటువంటి రైతులు మండుటెండ సైతం లెక్కచేయకుండా రాస్తారోకో చేసిన ప్రభుత్వ అధికారులు మాత్రం ఏసి రూములో కూర్చుని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు

ఇప్పటికైనా తడిచిన ధాన్యం తో సహా ఆంక్షలు లేకుండా మద్దతు ధరతోని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పై అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది

ప్రజలను దోచుకోవటంలో ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని విమర్శించారు

ఇంతలో ఐకెపి అధికారులు రాస్తారోకో వద్దకు చేరుకొని పై అధికారులతో మాట్లాడి రైతులకు ఆ మీ ఇచ్చిన తర్వాత , రైతులు శాంతించి రాస్తారోకోని విరమించారు

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడె, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోక్రసీ కూసుమంచి సబ్ డివిజన్ నాయకులు బత్తుల చిన్న ఉప్పయ్య పి వై ఎల్ మండల కమిటీ సభ్యులు చాపల నరేష్ భూక్య లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారిపల్లి శ్రీనివాస్ దండువుల నరసయ్య భూక్య ఒప్ప తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected