విఒఎ ల న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలి

సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం.
ఏప్రిల్ 24.
విఒఎ ల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించాలి.
లయన్ నీలి ప్రకాష్.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐకెపి విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 3 తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విఓఏ ఉద్యోగుల సంఘం కు సోమవారం నాడు ”మీకోసం మేమున్నాం” సహాయక సమితి పూర్తి మద్దతు తెలిపింది.
చర్ల మండల కేంద్రం బస్టాండు ప్రాంగణంలో లో సమ్మె నిర్వహిస్తున్న విఓఏ లను కలిసి వారి సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుని వారికి “మీ కోసం మేమున్నాం” సేవాసంస్థ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది అని ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ అన్నారు, గ్రామ స్థాయిలో 19 సంవత్సరాలగా సెర్ప్ సంస్థ ద్వారా తమ సేవలందిస్తూ, గ్రామాల్లోని మహిళల అభ్యున్నతికి పాటుపడుచున్న వీఏఓ ల న్యాయమైన కోరికలను, ప్రభుత్వం సామరస్య ధోరణితో పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దొడ్డ ప్రభుదాస్, ఎర్రమిల్లి కిరణ్ కుమార్, చీమకుర్తి సాయిచరణ్, దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.