EducationPoliticsTelangana

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం.

లీకేజీ లో బిజెపి కుట్ర కోణం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఏప్రిల్ 05,

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు,ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బిజెపి నాయకులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి,పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు…

ఈ సందర్భంగా కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ చదువు గురించి అడుగుతుంటే బిజెపి నాయకులు దానికి సమాధానం చెప్పకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అజ్ఞాని మండిపడ్డారు, ప్రస్తుతం బిజెపి అంటే ఒక జూట పార్టీకి ప్రత్యక్ష నిదర్శనంగా మారింది అన్నారు, అబద్దాల యూనివర్సిటీలతో ఆ పార్టీ నేతలు డిగ్రీలు పంచుకుంటున్నారని ఎద్దేవ చేశారు, బండి సంజయ్ లాంటి అర్హత లేనోడికి స్థాయిని మించి పదవి ఇస్తే ఇలానే ఉంటుందని విమర్శించారు, సోషల్ మీడియాలో బండి సంజయ్ ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు, రాష్ట్రంలో పరీక్షలు లీకేజీ వ్యవహారంలో బిజెపి కుట్ర కోణం ఉందని తమ అనుమానాలు నిజమయ్యాయని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసపాలు చేయడానికి బిజెపి అగ్ర నాయకత్వం చేసిన కుట్రలో భాగంగానే ఈ పేపర్ లీకేజీ లనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు, విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం వారి దివాలా కోరు రాజకీయ విధానాలు నిదర్శమని విమర్శించారు, ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది అని ఈ విషయంలో వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నదని అన్నారు,75 ఎండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూపు రేఖలు మారిపోయాయి అన్నారు, సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పథకాలను శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు పర్వాలేక పోతున్నారని ఆరోపించారు బిజెపి పలితా రాష్ట్రాలలో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు సగం కూడా లేవని ఆకలి సేవలు కొనసాగుతుందని పేర్కొన్నారు చిల్లర రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీలకు రాను ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, మండల బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మండల నాయకులు సూదిరెడ్డి గోపి రెడ్డి,చిలక వెంకటరమయ్య,తూము చిన్న రాఘవులు,ఏన్నా సంజీత్ రావు,బానోత్ శెంకర్,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు గొర్రెముచ్చు వెంకటరమణ, వాళ్లేపోగు రాము, మండల యువజన నాయకులు రామారావు, అరవింద్,సంపత్,శెంకర్,కరకాపల్లి డేవిడ్,మేకల భాస్కర్,తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected