KhammamTelangana

వివాదాస్పద భూమిలో వెలసిన గుడిసెలు తొలగింపు

వివాదాస్పద భూమిలో వెలసిన గుడిసెలు తొలగింపు

వివాదాస్పద భూమిలో వెలసిన గుడిసెలు తొలగింపు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్ లో సర్వే నంబర్ 334 లో గల ఎకరం ముప్పై కుంటల వివాదాస్పద భూమిలో నివాసం ఏర్పాటు చేసుకున్న దాదాపు 80 కుటుంబాల గుడిసెలను బుధవారం భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు తొలగించారు. పోలీస్ శాఖ అధికారులు, కనీసం మా వస్తువులను తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వస్తువులన్నీ ధ్వంసం చేశారని పలువురు మహిళలు ఆరోపణ చేశారు. కావాలనే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీని వెనక రాయల పుష్పవతి, టీచర్ గిరి బాబు, రాయల్ నాగేశ్వరరావు హస్తం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

సర్వే నెంబర్ 334, గల ఎకరం 30 కుంటల ప్రభుత్వ భూమిని రాయల పుష్పావతి అనే పేరుపై దాదాపు 20 ఏళ్లకు పూర్వం అప్పటి ప్రభుత్వం అసైన్ చేయడంతో కొంత కాలం తరువాత ఆ భూమిలో వ్యవసాయం చేయడం లేదని, అప్పటి సత్తుపల్లి తలాసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో మళ్ళీ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, తహశీల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆర్డీవో కు అప్పీల్ చేయడంతో గత నాలుగు నెలల క్రితం ఆ వివాదాస్పద భూమి ప్రభుత్వానికే చెందుతుందని ఆర్డీవో కూడా తీర్పు ఇవ్వడంతో సదరు రాయల పుష్పవతి తరపు లాయర్ హై కోర్టు ద్వారా సోమవారం స్టే తెచ్చారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగా కాకర్లపల్లి లోని కొంతమంది పేద ప్రజలు ఈ వివాదాస్పద భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.


గత 6 నెలలుగా నివసిస్తున్న వారిని భారీ బందోబస్తు మధ్య దాదాపు 100 మందికి పైగా 6 స్టేషన్ ల నుండి వచ్చిన పోలిసుల సహాయంతో బుధవారం రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ప్రోక్లిన్ సహాయంతో తొలగించారని పలువురు మహిళలు ఆరోపించారు. నిద్రపోతున్న సమయంలో పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి ఇలా తమ గుడిసెల కూల్చడం చంటి పిల్లలతో ఉన్న తాము భయభ్రాంతులకు గురయ్యామని, ఇదేంటి అని ప్రశ్నించిన వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్నారని, తమ సామాన్లను కూడా ట్రాక్టర్ సహాయంతో తహసీల్దార్ కార్యాలయానికి తరలించారని వాపోయారు. గుడిసెల బాధితులు తమ బాధను వెళ్లబుచ్చారు.

దీనిపై స్థానిక తాసిల్దార్ కు వివరణ అడగగా, కాకర్లపల్లి సర్వేనెంబర్ 334 లో గల ప్రభుత్వ భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి రాయల్ పుష్పావతికి మధ్య వివాదం నడుస్తుందని, ఈ మధ్య కాలంలో ఆర్డీవో ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సదరు రాయల పుష్పావతి వారు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, ఈ మధ్య ఈ భూమిలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను పోలీసు వారి సాయంతో తొలగించి ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇది వివాదాస్పద భూమి అని అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రస్తుత తహసీల్దార్ పై శ్రీనివాసరావు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected