వివో ఏల. సమస్యలను పరిష్కరించలి.
కె. సత్య.

వివో ఏల. సమస్యలను పరిష్కరించలి.
కె. సత్య.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి.
వివో ఏళ్లకు కనీస వేతన 26000 ఇవ్వాలని డిమాండ్.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 28,
ఐకెపి వివో ఏల సమస్యలు పరిష్కరించాలి
భద్రాద్రి రెడీమేడ్ అండ్ క్లాత్ మర్చంట్ యూనియన్ అధ్యక్షులు. చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు తాళ్లపూడి రాము
తెలంగాణ ఐకెపి వివో ఏ సంఘం సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త సమ్మె లో భాగంగా భద్రాచలం వివో ఎలా సమ్మె శిబిరాన్ని సందర్శించి 12వ రోజు దీక్షను ప్రారంభించిన రాము మాట్లాడుతూ
ఈ ప్రభుత్వం వివో ఏ లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పని భారం విపరీతంగా పెంచిందని, ఆన్లైన్లో రిపోర్టులు ఆఫ్ లైన్ మీటింగ్, ప్రభుత్వ సర్వేలు, అనేక పనులు చేస్తూ ప్రజలకు బ్యాంకులకు మధ్య వారధిగా ఉంటూ కోట్ల రూపాయలు ప్రజలకు బ్యాంకుల నుండి ఇప్పిస్తూ తిరిగిరికవరీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించట్లేదని ఇంత కష్టపడి పని చేస్తున్న వివో ఏలకు జీతాలు పెంచాలని ఆయన అన్నారు
వివో ఏలకు కనీస వేతనం 26,000/- ఇవ్వాలని వివోఏలను సేర్పు ఉద్యోగుల గుర్తించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆన్లైన్ రిపోర్ట్ లు చేయమని గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని వివో ఏ జీతాలు వివో ఏ ఎకౌంట్లోనే వేయాలని అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో సిఐటి పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి మాట్లాడుతూ 12 రోజులుగా సమ్మె చేస్తున్న వీరి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని 3900/- రూపాయలతో కుటుంబాలు ఎలా నడుస్తాయని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. వివోఏలు భద్రాచల పట్టణంలో మాకు విరాళాలు ఇవ్వండి మా పోరాటానికి మద్దతు తెలపండి అని కోరుతూ విరాళాల సేకరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక .సిఐటియు పట్టణ కమిటీ సభ్యులు సంతోష్ .అప్పారి రాము. ధర్మ . వివో ఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి చంద్ర లీల కోశాధికారి సీతారత్నం సహాయ కార్యదర్శి జానకి రాము సల్మా తదితరులు పాల్గొన్నారు