
ఈత సరదా విషాదం కాకూడదు.
అశ్వాపురం సి.ఐ చెన్నూరి శ్రీనివాస్..
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 20,
ఈత సరదా విషాదం కాకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల, చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి.
గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు జలాశయాల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి. వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్తుంటారు.. ఈత నేర్చుకునే పిల్లలు తల్లిదండ్రుల పెద్దల సమక్షంలో జాగ్రత్తలు వహించి ఈత నేర్చుకోవాలి. ప్రమాదాలు జరగకముందే మీ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించండి…