వైరా నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి వైరా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్ సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు ,… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మనిషిగా జన్మించాక ఎలాగో ఒకలా బతికేయడం కాదు..ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, చుట్టుపక్కలవారితో ఎలా మమేకమవ్వాలి, కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకేఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు.
శ్రీరామచంద్రుడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమి హిందువులకు అత్యంత విశేషమైన పండుగ. ప్రతి ఇంట్లో ఈ వేడుకను జరుపుకుంటారు. శ్రీరామచంద్రస్వామి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. సత్యమార్గాన్ని అనుసరిస్తూ… తండ్రి ఆదేశాన్ని పాటించిన రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పద్నాలుగేళ్లు అడవుల్లో ఉన్న తర్వాత అయోధ్య చేరుకున్నాడు. అప్పుడు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తులు భావిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. అందుకే శ్రీరామ నవమి నాడు ఎంతో వైభవంగా సీతారాముల కల్యాణం జరుపుతారు.
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
*మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.