PoliticsTelangana

“వై.ఎస్. షర్మిల పట్ల పోలీసుల అతి ఉత్సాహన్ని తీవ్రంగా ఖండించిన నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్”

“వై.ఎస్. షర్మిల పట్ల పోలీసుల అతి ఉత్సాహన్ని తీవ్రంగా ఖండించిన నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్”

లోటస్ పాండ్ నుండి బయటికి వస్తున్న క్రమములో తెలంగాణ వై. ఎస్. అర్. పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వై. ఎస్. షర్మిల గారిని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న తీరు చాలా హెయమైనదిగా పేర్కొంటూ దీన్ని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది.
ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ, తెలంగాణలో స్త్రీ అనే గౌరవంకూడ లేకుండా అడుగడుగున అడ్డుకోవడం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఎంత స్వేచ్ఛ ఉందో ఇతర పార్టీలకు కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యా బద్దంగా నడుచుకుంటూ ఎవరి పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు వారిని నిర్భందించే హక్కుగాని అధికారంగాని ఏ పార్టీకిలేదు.

తెలంగాణలో ఎవరు గొప్పకాదు ఎవరు తక్కువకాదు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. తెలంగాణ వై. ఎస్. అర్. పార్టీ అధ్యక్షురాలు తన పార్టీ కార్యాలయం నుండి బయటివస్తే అడ్డుకోవడం, పార్టీ కార్యక్రమాలు పెట్టుకుంటే అడ్డుకోవడం లాంటి కార్యాకలపాలకు ఎందుకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారో ఒకసారి పునరాలోచన చేసుకోవాలి అని నేషనల్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ చీఫ్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు వై. ఎస్. షర్మిల గారిపట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తూ, ఏదిఎమైన ప్రతి రాజకీయ పార్టీకి ప్రజల్లో వెళ్ళాలి ఏదో చేయాలనే తపన ఉండడం సహజం.

దీన్ని అర్ధం చేసుకోని ఎవరిపరిధిలో వాళ్ళు ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజలకు సేవలు అందిస్తే ఎవరు వద్దు అన్నారు? పార్టీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి వారి వారి గమ్యం చేరుకోవడానికి రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారికుంటాయి.

కానీ వారి ఆశయాన్ని అణిచివేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్లు సుస్పష్టంగా గత కొన్ని సంవత్సరాలనుండి నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ గమనిస్తూనే ఉంది. కానీ ఎందుకులే ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు చేసుకోనిలే అని మంచి సదుద్దేశంతో మేము పట్టించుకోలేదు.

అయితే ఒక ఆడపడచు అని కూడ చూడకుండా తెలంగాణ పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా వారి హద్దులుమీరి ప్రవర్తించడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected