
శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి ………
సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలి PDSU ఖమ్మం.
ఈరోజు పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీముఖ్య కార్యకర్తల సమావేశం లెనిన్ నగర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో జరిగింది ….
ఈ సందర్భంగా పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిG. మస్తాన్ మాట్లాడుతూ. ఈరోజు హైదరాబాదులో శ్రీ చైతన్య క్యాంపస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపి ఆ విద్యార్థి ప్రాణాలు తీయడం జరిగింది విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం కోటి రూపాయలు ఇవ్వాలని వారి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని వారు అన్నారు కానీతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బడా కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య నారాయణ ఎస్సార్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతవరకు స్వాధీనం చేసుకోకుండా విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఏమి పట్టించుకోకుండా నింగికి నీరు లాగా వ్యవహరిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈనెల 15 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కానీ ప్రైవేటు కార్పొరేటు జూనియర్ కళాశాలలో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజుల ఒత్తిడి చేస్తూ ఈరోజు కొనసాగించిన పరిస్థితి శ్రీ చైతన్యాలు కనపడ్డది సాత్విక్ అనే విద్యార్థి ఫీజు ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది ఎంతమంది ప్రాణాలు తీస్తారు ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పండి. శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యాసంస్థలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారిని హెచ్చరించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోపి అశ్విని శ్రావ్య ఆర్కే ప్రకాష్..
ఇట్లు..
విప్లవ అభినందనలతో.
పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా కమిటీ..
PDSU.జిల్లా కార్యదర్శి జి మస్తాన్..
7729950490