సమాచారం మాకు బహుమతి మీకు

హై అలర్ట్: సమాచారం మాకు బహుమతి మీకు
“ములుగు జిల్లా సి కె ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా నుగుర్ వెంకటాపురం మండలంలో ఈరోజు సిఐ కె శివప్రసాద్ సురవీడు ఆల్బక సమీప ప్రాంతాలలో సిఆర్పిఎఫ్ బృందంతో కలిసి వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టారు వెంకటాపురం వాజేడు మండలాల్లో యాక్షన్ టీం సంచరిస్తున్నట్టుగా నమ్మదగిన సమాచారం మేరకు హై అలర్ట్ ప్రకటించారు మావోల అడుగుజాడలకు చెక్ పెట్టే విధంగా డ్రోన్ కెమెరాలతో తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు భద్రత బలగాలతో వాహనా విస్తృత తనికి చేపట్టిన వెంకటాపురం పోలీస్ బృందం. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా నిలువు నీడ కోసం అర్ధించినా అనుమతి లేకుండా పార్టీల పేరుతో మారుమూల ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించిన వెంటనే మండల పీ ఎస్ కు సమాచారం అందించాలి అంటూ పోలీస్ రికార్డులో ఉన్న మావోల పేర్లను, చెపుతూ బద్రు మహేష్ మహేందర్ కరుణాకర్ చిత్ర కరపత్రాలతో మావోలకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తే లాండ్ ఆర్డర్లో ఉన్నటువంటి శిక్షలకు అర్హులవుతారని ప్రయాణికులకు తెలియజేస్తూ ప్రయాణికుల పూర్తి వివరాలు సేకరిస్తూ వాహన తనిఖీలు నిర్వహించారు వెంకటాపురం పోలీస్ సిబ్బంది,,,