
“సావిత్రిబాయి ఫూలే గారి వర్ధంతి సందర్బంగా ఘన నివాళి అర్పించిన నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్.”
చెరిత్రలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్బంగా ఆమె చేసిన సేవలను జ్ఞాపకం చేస్కుంటూ ఘనంగా నివాళి అర్పించిన నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్.
ఈ నేపథ్యంలో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ అధికార ప్రతినిధులు చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు, డీజీసీఈఓ డాక్టర్ ప్రవీణ్ రావు నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ జాన్ ఖంతారావు, నేషనల్ ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ పత్రిక ప్రకటన విడుదలచేస్తూ, సావిత్రిబాయి ఫూలే గారు చేసిన సామాజిక సేవలు ఆమెలో ఉన్న పట్టుదల అనేకుల గుండెల్లో చెరగని ముద్రవేశాయి అనుట్లో అటువంటి సందేహంలేదు ఉండబోదుకూడా! అటువంటి త్యాగమూర్తి, ఆదర్శమూర్తి భారత ముద్దుబిడ్డకు నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఘననివాళి అర్పిస్తుందని పేరుకున్నారు.
“ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే” భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయిని. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రీబాయిని కదిలించాయి. మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందిన నయ్‌గావ్‌లో 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన సావిత్రీబాయి జన్మించింది. అప్పటి పరిస్థితులనుబట్టి ఆమెది కూడా బాల్య వివాహమే. ఆమె వివాహం సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలేతో జరిగింది. వివాహానంతరం సావిత్రీబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనలను గుర్తించిన జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు.
1848వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పుణే లో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను సావిత్రీబాయి ప్రారంభించింది. ఆమె ప్రధానోపాధ్యాయినిగా 9 మంది పిల్లలతో బడి నడిపేది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవ ర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడు లకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజా లాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరల వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగిన ప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది.
పట్టువీడక వారు సాగించిన విద్యా ఉద్యమా నికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1851, నవంబర్ 16న విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించింది.
తన జీవితాన్ని త్యాగంచేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పా టు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసికులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
సామాజిక సేవలో అంతిమశ్వాస
1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది.
1897వ సంవత్స రం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
కానీ ఇటువంటి గొప్ప దేశంలో ఇంకా స్త్రీకి సంపూర్ణ రక్షణ స్వచ్ఛలేకుండా సమాజంలో స్త్రీపట్ల వివక్ష, హింస, హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో మార్పురావలసిన ఆవశ్యకత స్త్రీపట్ల గౌరవాన్ని పెంపోందించాలి కానీ దిగజారి పోకూడదు.
స్త్రీ హక్కులను కాపాడుకుందాం! మరియు ప్రతి తల్లి, చెల్లి అక్క, తలెత్తుకొని చిరునవ్వుతో వర్ధిల్లాలని కోరుకుందాం! మరో సావిత్రిబాయి ఫూలేలను ఈ దేశం ఉన్నతి కొరకు ప్రశాంతంగా జీవించేలా వారికి అండగా ఉందాం! అన్నారు.
ఈ సందర్బంగా డిప్యూటీ నేషనల్ మీడియా చీఫ్ భూక్యా ఉపేందర్, అసిస్టెంట్ నేషనల్ మీడియా చీఫ్ ప్రకాష్ జాదవ్ కూడా పాల్గొని స్త్రీ యొక్క స్వేచకు రక్షణకు వివక్షా వద్దు, వారిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు.