BadradriTelangana

సింగరేణి అధికారిపై బి ఆర్ ఎస్ నేత దాడి

సింగరేణి అధికారిపై బి ఆర్ ఎస్ నేత దాడి

సింగరేణి అధికారిపై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకుని పై చర్యలు చేపట్టాలి.

మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ కి వినతి పత్రం అందజేసిన ఏరియా సింగరేణి అధికారులు.

సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
ఇల్లందు ఏరియా జవహర్ ఖని ఓపెన్ కాస్ట్ గని రక్షణ అధికారి ఇన్ ఛార్జ్ మేనేజర్ శివప్రసాద్ పై దాడి చేసిన బి ఆర్ ఎస్ నాయకుడు సింగరేణి కార్మికుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఏరియా అన్ని గనులు డిపార్ట్మెంట్లకు చెందిన సింగరేణి అధికారుల సంఘం సభ్యులు సోమవారం ఏరియా జిఎం దుర్గం రామచందర్ కి అధికారుల సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు డి లలిత కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న అధికారిపై డ్యూటీలో తమ ఆటలు సాగటం లేదని నెపంతో శివ ప్రసాద్ ని దుర్భాష లాడటమే కాకుండా ఇంటికి వెళ్లి మరీ బెదిరింపులకు దిగటం భౌతిక దాడికి పాల్పడటాన్ని ఏరియా అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు,

శ్రీనివాసరెడ్డి పై తగు చర్యలు చేపట్టకపోతే ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని కూడా వారు హెచ్చరించారు ఇలాంటి సంఘటన నేపథ్యంలో సంస్థ పురోగతికి అహర్నిశలు శ్రమించే గీతా భావం అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్యలు ఎవరు చేపట్టిన వారిపై కఠిన చర్యలు ఉండాలని అధికారులకు ఎవరిపై వ్యక్తిగత ద్వేశాలేమి ఉండవని సంస్థ పురోగతి కోసమే పని చేస్తామని ఇలాంటి సంఘటనలో పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యం ఉన్నదని వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, అధికారులు జే వి రమణ, బి శ్రీనివాసచారి, ఎం నర్సిరెడ్డి, ఎస్ రమేష్,వెంగళరావు, అనురాధ, సంధ్య రాణి, దండమూడి రాంబాబు, బి వెంకటేశ్వర్లు, బి రాజేశ్వరరావు, ఎం లింగబాబు, నరసింహ స్వామి, కె సుదర్శన్ రెడ్డి, సురేష్, దాసరి రాజశేఖర్, షబ్బీ రుద్దీన్, ఎండి మదార్ సాహెబ్, భూక్య భాoగ్య, కళ్యాణ్ రామ్, ఎస్ మధుసూదన్, ఆర్ మధుబాబు, రామేశ్వర్, సర్వర్ నభి, సతీష్ కుమార్ అని గనులు డిపార్ట్మెంట్ల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected