PoliticsTelangana

సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు

సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు

-బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని తెలిసి పీసీసీ పదవి నుండి తప్పిస్తారనే బాధతోనే కన్నీళ్లు పెట్టుకున్నారేమో

-ఈటల రాజేందర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది?

-మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మేమంతా అదే మాట చెప్పాం కదా

-బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలే ఈ విషయంపై బహిరంగంగా చర్చించుకున్నారు కదా?

-బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుకు యత్నిస్తోందని మల్లిఖార్జున్ ఖర్గే కూడా చెబుతున్నారు కదా?

-కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులిచ్చింది నిజం కాదా?

-నీచులైన అతీక్ అహ్మద్ కొడుకును ఎన్ కౌంటర్ చేస్తే, అతీక్ అహ్మద్ ను చస్తే సంతాపం తెలపడమా?

-ఓట్ల కోసం బీఆర్ఎస్, ఎంఐఎం మత రాజకీయలు చేయడం సిగ్గు చేటు

-తెలంగాణ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్న

-కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్..

-ఈటల రాజేందర్ తో కలిసి బసవేశ్వరుడి విగ్రహానికి ఘన నివాళి

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదని చెప్పారు. ‘‘రేవంత్ ఏడుపు నిజమే. బాధ ఉంటేనే ఏడుపొస్తది. కానీ దేని కోసం బాధపడ్డారో తెలుసా? రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నరు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ బాధతోపాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనను మారుస్తారనే బాధ కూడా తోడై వచ్చిన నీళ్లే రేవంత్ కు కన్నీళ్లుగా మారాయి.’’ అని వ్యాఖ్యానించారు. మహాత్మా బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని ఈరోజు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తో కలిసి ట్యాంక్ బండ్ వద్దనున్న బసవేశ్వరుడి విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఈటల రాజేందర్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

మహాత్మ బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని ఆయన భక్తులకు, వీరశైవ లింగాయత్ లకు శుభాకాంక్షలు. 12వ శతాబ్దంలోనే పార్లమెంట్ తరహాలో అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి కులరహిత సమాజం కోసం నిరంతరం పరితపించిన మహనీయుడు బసవేశ్వరుడు. అన్ని వర్గాల అభ్యున్నతికి క్రుషి చేస్తూ మహిళల సంక్షేమం కోసం క్రుషి చేసిన గొప్ప వ్యక్తి.

ప్రధానమంత్రి మోదీ బసవేశ్వర బోధనలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారు. బసవేశ్వర బోధనలను ప్రపంచానికి చాటిన వ్యక్తి మోదీ. లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున బసవేశ్వరుడి విగ్రహాన్ని నెలకొల్పారు.

కర్నాటకలో రూ.600 కోట్లతో అనుభవ మంటపాన్ని పునర్నిర్మించేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది.

లింగాయత్ లను ఓబీసీలను చేర్చాలనే డిమాండ్ ఉంది. ఓబీసీ మోర్చా నాయకత్వంలో కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదన సమర్పించడమైనది. లింగాయత్ ల డిమాండ్ మేరకు వారిని ఓబీసీలో చేర్పించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాం.

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ అన్నదాంట్లో తప్పేముంది? ప్రూఫ్ అడిగేటోళ్లకు చెబుతున్నా… ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ప్రతిపక్షాల కూటమికి ఛైర్మన్ ను చేస్తే ఎన్నికల ఖర్చంతా నేనే పెట్టుకున్నానని కేసీఆర్ చెప్పినట్లు మీడియాలో వచ్చింది కదా… దానికి ప్రూఫ్ ఉందా?

రాజేందర్, నేను చాలా రోజుల నుండి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులిచ్చారని చెబుతూనే ఉన్నాం కదా… కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు కదా….

రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదు. నిజంగా బాధ ఉంటేనే ఏడుపొస్తది. కానీ దేని కోసం బాధపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నరు.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకీ బీఆర్ఎస్ డబ్బులు సాయం చేస్తోంది? నిజమా? కాదా? చెప్పాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే… ఇదేమాట గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి కూడా చెబుతున్నారు కదా… అంతెందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నిస్తున్నామని రాజ్ దీప్ సర్దేశాయ్ తో చెప్పారు కదా…దీనిపై ఏమంటారు?

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది తెలిసి తనను పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే బాధ రేవంత్ కు ఉంది. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు తప్పదని తెలిసి ఆ బాధతో వచ్చిన నీళ్లే కన్నీళ్లుగా మారాయి.

రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ తెలంగాణలో ప్రతి ఒక్కరిని భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్దకు తీసుకురావాలన్నది బీజేపీ ఆశయం నెరవేరింది.

అతీక్ అహ్మద్ కొడుకును ఎన్ కౌంటర్ చేస్తే, అతీక్ అహ్మద్ చస్తే వాళ్లకు అనుకూలంగా ఎంఐఎం నేతలు మాట్లాడటం సిగ్గు చేటు. పోలీసులను చంపిన నీచుడు అతీక్ అహ్మద్, ఆయన కొడుకు. పేదల రక్తం తాగి వేల కోట్లు దోచుకున్న దుర్మార్గుడు అతీక్ అహ్మద్, ఆయన కొడుకు. అట్లాంటోళ్లకు మద్దతుగా ఎంఐఎం నేతలు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు.

పాతబస్తీని న్యూసిటీ చేయాలని బీజేపీ యత్నిస్తుంటే… ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పార్టీ ఎంఐఎం. అతీక్ అహ్మద్ లాంటి నీచులు చనిపోతే సంతాపం ప్రకటించడం సిగ్గుచేటు… అతీక్ కొడుకును ఎన్ కౌంటర్ చేస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఖండించడం సిగ్గు చేటు.. అలాంటి నీచుడిని గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తారా? ఎటుపోతోంది ఈ సమాజం? ఇట్లాంటి పార్టీలు మనకు అవసరమా? ఓటు బ్యాంకు కోసం మతపరమైన రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవసరమా? తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నా.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected