
ఖమ్మం జిల్లా రావినూతలలో సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఎంపీ రవిచంద్ర*
సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం
పంట నష్టం జరిగిన చేళ్లను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఘన స్వాగతం పలికారు.
వడగళ్ల వాన కారణంగా ఖమ్మం జిల్లా బొమ్మకల్లు మండలంలో పంట నష్టం జరిగిన చేళ్లను పరిశీలించేందుకు హెలికాప్టర్ ద్వారా రావినూతలకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు హెలిప్యాడ్ వద్ద ఎంపీ రవిచంద్ర స్వాగతం పలికారు.రావినూతుల,గార్లపాడులలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను ముఖ్యమంత్రి పరిశీలించి,ఎకరాకు 10వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.
హెలిప్యాడ్ వద్ద విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని, ఉచితంగా విద్యుత్, సాగునీరు,పంట పెట్టుబడి అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపబోమని,మన గోడు వినే పరిస్థితుల్లో కేంద్రం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని రైతులను కోరారు.నష్ట పరిహారంగా ఎకరాకు రూ. 10వేల చొప్పున 2లక్షల28వేల ఎకరాలకు 228 కోట్లు వెంటనే విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య,మెచ్చా నాగేశ్వరరావు,కందాళ ఉపేందర్ రెడ్డి,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం,కూనంనేని సాంబశివరావు,మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, డాక్టర్ చంద్రావతి తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాహుల్ బొజ్జా,నవీన్ మిట్టల్,స్మితా సబర్వాల్, రఘునందన్ రావు తదితరులు ఉన్నారు.