
దనసరి సూర్య గో బ్యాక్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పినపాక కాంగ్రెస్
ములుగు సీతక్క తనయుడు దనసరి సూర్య పై పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల ఫైర్ గో బ్యాక్ సూర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 02
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక నియోజకవర్గం నేతలు ఫైర్…
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…
సూర్య తనకు కాంగ్రెస్ అధిష్టానం పినపాక టికెట్ ఇస్తుందని బూటక ప్రచారం చేస్తూ ఇక్కడ నాయకుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు….
స్థానిక నాయకుల పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని మానుకోవాలని..
స్థానికంగా పార్టీ తరఫున పదిమంది ఆశావహులు ఉన్నారు. వీరిలో ఎవరికి వచ్చిన అందరం కలిసి పనిచేస్తాం కానీ ఇక్కడ ధనసరి సూర్య పోటీ చేస్తా అంటే మాత్రం ఊరుకునేదే లేదనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
స్థానికులను కాదని జిల్లాల అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన సహకరించాం అంటూ హెచ్చరిస్తున్నారు…
ఇక్కడ ఆయన ప్రచారం చేసుకోవడానికి స్థానిక మండల అధ్యక్షుల సహకారం కూడా ఉండబోదని…
మేమంతా కాంగ్రెస్ కోసం కష్టపడుతూ ఉంటే మధ్యలో ఎవరో స్థానికేతర వ్యక్తి వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అంటే సహించం ఇకనైనా అధిష్టానం గుర్తించి దనసరి సూర్య పై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధ్యక్షులు,ఆశావాహులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు