
సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని శాఖలలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు.
దశల వారీగా అన్ని విభాగాలకు విస్తారిస్తం..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం
మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా నేపద్యంలో అత్యవసర సమయాల్లో చేపట్టే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో DM &HO శిరీష అధ్వర్యంలో ఏర్పాటు చేసిన CPR అవగాహన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాజరైన అధికారులు, సిబ్బందికి CPR చేసే విధానాన్ని వైద్యులు చేసి చూపించారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
ప్రస్తుత సమాజంలో మారిన ఆహార అలవాట్లు, జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో వయసుతో సంబంధం లేకుండా పెరిగినప్రధానంగా, చిన్నా పెద్ద తేడా లేకుండా గుండె పోటుతో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారన్నారు.
అలాంటి సమయంలో వారిని కాపాడేందుకు ఒకే ఒక్క పరిష్కారం సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) ఎంతో ప్రయోజనకరం అని, ఈ పద్ధతిని అనుసరించి గుండె లయ ను సాధారణ స్థాయికి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.
ఛాతి ఎడమ భాగంపై చేతులతో ఒత్తిడి పెంచి కృత్రిమ శ్వాస అందించడం ద్వారా ప్రాణం పోసే అవకాశం ఉండడంతో ఈ విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అందుకోసం జిల్లాలో విడతల వారీగా వైద్య అరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర విభాగాలైన మెడికల్, పోలీస్, మున్సిపల్, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి, ఆ తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
ఉరుకులు, పరుగుల జీవనం.. మారుతున్న ఆహారం, పరిస్థితుల కారణంగా అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారని, వయస్సుతో సంబంధం లేకుండా సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారని, ఇలాంటి పరిస్థితిలో వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.