
సీసీ కెమెరాల ప్రయోజనాలు పై అవగాహన కల్పిస్తున్న.
బూర్గంపాడు ఎస్ఐ సంతోష్
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 10,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లోని ప్రధాన రహదారిలో గల పలు దుకాణాలను సందర్శించి సీసీ కెమెరాల ఏర్పాట్లను, వాటి ప్రయోజనాల పై అవగాహన కల్పించిన బూర్గంపాడు ఎస్ఐ సంతోష్.
గతంలో కూడా పలు ప్రధాన రహదారుల లో పనిచేయని సీసీ కెమెరాలను పునరుద్ధకరించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే బూర్గంపాడు మండలంలో ఉన్న ప్రధాన రహదారులలో మణుగూరు క్రాస్ రోడ్, సారపాక, బూర్గంపాడు, మొరంపల్లి బంజార లాంటి ప్రధాన రహదారుల కూడలి లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని దీనికి బూర్గంపాడు మండల ప్రజలు మరియు దుకాణదారులు సహకరించాలని తెలియజేశారు.