
సీసీ రోడ్స్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
ఇప్పటి వరకు రూ.12 కోట్ల సుడా నిధులతో 173 రోడ్లు వేసుకున్నాం.
ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని రోడ్లు..
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం నగరం 10వ డివిజన్ నందు సుడా నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్స్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన చైతన్య నగర్ ఆర్చ్ ను మంత్రి ప్రారంభించారు.
ఖమ్మం నగరంలో అవసరమైన మేర అన్ని రోడ్స్ ను సిసిలు గా మార్చగలిగామని అన్నారు. ఇప్పటి వరకు కార్పోరేషన్ పరిధిలో రూ.12 కోట్ల సుడా నిధులతో 173 రోడ్లు వేశామని పేర్కొన్నారు.
ప్రజా అవసరాల మేరకు కార్పోరేషన్ పరిధిలో ఇంకా అవసరం అయిన చోట మరిన్ని రోడ్లు, డ్రెయిన్లు వేస్తామని, ముఖ్యంగా ముందుగా డ్రైన్స్ పై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.
కార్యక్రమంలో MAYOR పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ చావా మాధురి నారాయణరావు, పబ్లిక్ హెల్త్ DE రంజిత్, మున్సిపల్ DE రంగారావు తదితరులు ఉన్నారు.