
దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రాల సెంట్రల్ లైటింగ్ కు త్వరలో టెండర్ ప్రక్రియ
ఇప్పటికే పూర్తయిన అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్ర టెండర్ ప్రక్రియ….త్వరలో ప్రారంభం కానున్న పనులు
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ముందు 15 కోట్ల 75లక్షలు నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పత్రాన్ని అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారికి అందజేసిన విషయం తెలిసిందే కాగా మిగిలిన మూడు మండలాలకు కూడా సెంట్రల్ లైటింగ్ కావాలని MLA మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరగా వెంటనే స్పందించి 23 కోట్ల 50లక్షలు నియోజకవర్గ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తూ పత్రాన్ని MLA మెచ్చా నాగేశ్వరరావు కి అందజేసారు.
ముందు మంజూరు చేసిన 15కోట్ల 75లక్షల నిధులను దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రాలలో ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో శుక్రవారం అనగా నిన్న జిల్లా కలెక్టర్ అనుదిప్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా త్వరలో మూడు మండలాల సెంట్రల్ లైటింగ్ టెండర్ ప్రక్రియకు వెళ్లనుంది.కాగా ఇప్పటికే అశ్వారావుపేట టెండర్ ప్రక్రియ పూర్తయి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.