
సైన్స్ ఫెయిర్ వేడుకలకు హాజరైన రేగా కాంతారావు .
సీకే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 04,
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని పైలెట్ కాలనీ నందుగల ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ నందు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రారంభించారు, విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను తిలకించారు,
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు, భావితరాలకు ఉపయోగపడేలా పరిశోధన ఫలాలు అందాలని ఆకాంక్షించారు, సైన్స్ మ్యాథమెటిక్స్ వలనే ప్రపంచం ముందుకు వెళుతుంది అన్నారు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చేసినటువంటి ఆధునికరణ ప్రత్యేకతలను చూసి వారిని కొత్త విషయాలు అడిగి తెలుసుకున్నామన్నారు, మారుమూల ప్రాంతాలలో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకోవడానికి సైన్స్ ఫెయిర్ లోని విద్యార్థులలో మంచి ప్రతిభ కనబరచాలని విద్యార్థులను ప్రశంసించారు,