
గురుకుల విద్యార్థులు స్టేట్ టాపర్గా నిలిచారు,
119 మంది ర్యాంకులు సాధించారు.
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,(సాయి కౌశిక్),
ఏప్రిల్ 29, గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులలో స్టేట్ ర్యాంకు తో పాటు ఖమ్మం జిల్లా ఎస్ ఓ ఈ కళాశాల విద్యార్థి టాపర్గా నిలవడం సంతోషించదగ్గ విషయమని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతంపోట్రూ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న స్కూలు ఆఫ్ ఎక్స్లెన్స్ యు ఆర్ జె సి ఆర్ జె సి కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక శాతం ర్యాంకులు సాధించారని గత సంవత్సరం 98 మంది ర్యాంకులు సాధించగా ఈ సంవత్సరం 119 మంది ర్యాంకులు సాధించారని దీంట్లో గురుకులాల్లో స్టేట్ టాపర్.