
జోరుగా…హుషారుగా…
హడావిడి లేదు….ఆర్భాటాలు లేవు…
ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్తూ…ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ….ప్రతి గుండెను తడుతూ….అందరికీ భరోసా ఇస్తూ…
సామాన్యులకు చేరువుగా,ప్రతి గడపను తాగుతూ,ప్రతి గోడు వింటూ..మీకోసమే వచ్చాను, మీకు అండగా ఉంటా అని ధైర్యం కల్పిస్తూ ..
నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేని ప్రాంతం లో యాత్ర ప్రారంభించి…సాహసం చేస్తూ… క్యాడర్ కి ఉత్తేజానిస్తూ…
మొత్తంగా మరో సారి నాటి వైఎస్ఆర్ పాదయాత్ర ను గుర్తుకు తెచ్చేలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతూ సాగుతున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర…
జోరుగా…హుషార్ గా
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష రథసారథి భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న పాదయాత్ర జోరుగా చాలా హుషార్ గా నడుస్తుంది…ప్రతి పల్లెను కలుపుతూ…ప్రతి గుడిసె ను చూస్తూ ..ప్రతి మనిషినీ కలుస్తూ,పలకరిస్తూ,ప్రతి గుండెను తాకుతూ,ప్రతి మనస్సును కదిలిస్తూ …క్యాడర్ లో స్ఫూర్తి నింపుతూ..భవిష్యత్ మీద భరోసా కల్పిస్తూ..యాత్ర సాగుతుంది…
హడావిడి లేదు…ఆర్భాటాలు లేవు
ప్రవేట్ సైన్యం తో దగ్గరగా వచ్చిన వారిని తోపిడీలు లేవు…పోలీసుల ఆంక్షలు అంతకన్నా లేవు… సాధారణంగా…సీదా సాధీగా ప్రజలలోకి వెళ్తూ…
తమ ప్రాంతంలో ఉన్న సాధారణ ఎమ్మెల్యే లనే వారి పదవి కాలంలో ఒక్క సారి కూడా కలవని అక్కడ మనుషులు రాష్ట్ర ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క ను నేరుగా కలవడం తన తో వారి బాధలు,సమస్యలను చెప్పుకోడం అక్కడ ఉండే వివిధ తెగలు,జాతుల ప్రజలకు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు….వారితో నేరుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కొందరు అన్న మాటలు ఇక్కడ కచ్చితంగా ప్రస్తావించాలి మాకు పెద్దగా టీ.వి లు,సెల్ ఫోన్ వ్యవస్థ మాకు అంతగా లేదు మేము మా ఎమ్మెల్యే ను నేరుగా కలిసింది లేదు కానీ మీరు మా కోసం మా దగ్గరకు నేరుగా వచ్చి మీలాంటి పెద్ద నాయకులు మా సమస్యలు తెలుసుకోడం మాకు చాలా ఆనందంగా ఉన్నది…
భరోసా ఇస్తూ…ధైర్యం కల్పిస్తూ
తెలంగాణ రాష్ట్రం లో అత్యంత వెనుకబడిన ప్రాంతం,అమాయక ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని ప్రజలకు నేరుగా వచ్చిన ఈ అవకాశం వారు చెపుతున్న సమస్యలను వింటూ వారికి రేపటి కాంగ్రెస్ ప్రభుత్వం లో సమస్యలను తీరుస్తాము అని భరోసా ఇస్తూ..మీకు నేను అండగా అంటా మీ సమస్యలు తీరే వరకు నేను పోరాటం చేస్తా అని వారికి ధైర్యం కలిపిస్తున్నారు భట్టి విక్రమార్క…
నలభై ఏళ్లుగా ప్రాతినిధ్యం లేని ప్రాంతం నుండి యాత్ర మొదలు
ఆదిలాబాద్ జిల్లా లో బోథ్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ లో ప్రాతినిధ్యం లేక నలభై ఏళ్లు అలాంటి ప్రాంతం నుండి యాత్ర ను మొదలు పెట్టడం అనేది నిజంగా రాజకీయంగా సాహసమే అని చెప్పాలి కానీ భట్టి విక్రమార్క గురించి తెలిసిన వారు చెప్పే మాటలు వింటే ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం సాహసమే అంటారు ఖమ్మం జిల్లా సహజంగానే కమ్యునిస్ట్ లు బలంగా ఉంటారు అందునా మధిర వారికి పెట్టని కోట వారికి తోడు 2009 లో మహా కూటమి తో టీడీపీ, తెరాసా పొత్తు నాడు ఆ మహా కూటమి నాయకులు అన్న మాటలు వింటే కూటమి గెలిచే మొదటి సీట్ మధిర అన్నారు చాలా మంది రాజకీయ విశ్లేకులు మధిర లో భట్టి విక్రమార్క మొదటి సారి పెద్ద సాహసం చేస్తున్నాడు అని కానీ ఆ ఎన్నికల్లో విజయం భట్టి విక్రమార్క ను రాష్ట్ర స్థాయిలో పేరు మర్మోగేలా చేసింది..అందుకే ఆయన ఈ యాత్ర ను బోథ్ నియోజకవర్గం లోని పిప్రీ గ్రామం నుండి మొదలు పెట్టడం తో ఎప్పుడూ భట్టి సాహసవీరుడే అని కాంగ్రెస్ క్యాడర్ అంటుంది…
నాటి వైఎస్సార్ ను గుర్తుకు చేస్తూ
నాడు మండు వేసవిలో వైఎస్సార్ పాదయాత్ర మొదలు పెట్టిన చేవెళ్ల లో ప్రారంభమైన రోజు వరుణుడు కరుణించాడు అలాగే భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టిన పీప్రి లో కూడా వరుణుడు ఆశ్వీర్ధించడం తో తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది అని యావత్ తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు….