Telangana

హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా మండల పరిధిలోని ఖానాపురం మరియు పాలడుగు మరియు తదితర గ్రామాల్లో విస్తృతంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని మరియు వరంగల్ రైతు డిక్లరేషన్ను ప్రజలకు తెలియజేస్తూ, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి రేణుక చౌదరి పిలుపుమేరకు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, వైరా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామాల్లో ,తండాల్లో మరియు గూడేంలల్లో ఉన్నటువంటి ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకెళ్తు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు మరియు రైతులకు ఏ విధంగా మేలు చేయబోతుందో తెలియజేస్తున్న వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

ఈ సందర్భంగా వైరా మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ కట్ల రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని హాథ్ సే హాథ్ జోడో డోర్ పోస్టర్స్ ని ఆవిష్కరించిన రాంమ్మూర్తి నాయక్

అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని, రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తుందని, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తుందని, సొంత ఇంటి కల నిర్మాణం కోసం ఇందిరమ్మ భరోసాగా 5 లక్షల రూపాయలు ఇస్తుందని, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ ఐదు వేల రూపాయలు ఇస్తారని, అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగుల కొరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని తెలియజేస్తూ,జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడోద్దని త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం పాలడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, వారిని వందనాలతో మనస్ఫూర్తిగా ప్రార్థించి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మౌలాలి, రఫీ ,కట్ల సంతోష్, వైరా ఐ ఎన్ టి యు సి టౌన్ అధ్యక్షులు వీరబాబు, అంబటి రంగారావు, అలీషా, రహేమ్తుల్లా ,జెనీమియా, నాగుల్ మీరా, మస్తాన్, ఖలీల్, దాదాసాహెబ్, మీరా సాహెబ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు కాసిం, జాన్ పాషా ,నాగుల్ మీరా, ఆదాం ,ఉస్మాన్ ,నన్నేసాహెబ్, బాషు, అలీ, సాయి, శ్రీనివాసరావు ,తిరుపతిరావు, రఫీ,పుట్ట రామారావు, సైదు బాబు, మోదుగు రాజు, మోదుగు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected