
రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిగ్మా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల సిగ్మా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో లిఫ్ట్ ప్రమాదం
పేషెంట్లను సెకండ్ ఫ్లోర్ కు తరలిస్తుండగా లిఫ్టు రెండు వైర్లు తెగిపడి హఠాత్తుగా ప్రమాదం
హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే లిఫ్ట్ ప్రమాదం జరిగిందని బాధితుల ఆగ్రహం
లిఫ్ట్ పై ఓవర్ లోడ్ పడడంతో ప్రమాదం జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం
తృటిలో తప్పిన పెను ప్రమాదం తీవ్రగాయాలతో పేషెంట్లు
సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఉన్న సిగ్మా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో లిఫ్ట్ ప్రమాదం జరిగి గాయపడిన పేషెంట్లు నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దేశరాజు నరసమ్మకు నోటిమాట రాకపోవడంతో సిగ్మా న్యూరో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది.
బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సిటీ స్కానింగ్ చేసి హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ కి వెళుతుండగా ఒక్కసారిగా లిఫ్టు తెగిపడి సత్యనారాయణ నరసమ్మల తలపై పడడంతో ఇద్దరికి తలకు కాళ్లకు,నడుములకు గాయాలు అవ్వడం జరిగింది.
ప్రమాదబాధితులకు వైద్య సేవలు అందించకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా దౌర్జన్యం చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
షాపింగ్ కాంప్లెక్స్ లో హాస్పిటల్ నిర్వహించడం చట్ట విరుద్ధం అయినా గాని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
రోగులకు కావలసిన భద్రత లేకుండా ప్రవేట్ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుందని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హాస్పటల్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లయితే రోగులు తప్పించుకోవడానికి చుట్టూ గ్రౌండ్ లేకపోవడం మరియు ఫైర్ జరిగిన ప్రదేశంలో ఫైర్ ఇంజన్ లాంటి వాహనాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగి మంటలు చల్లారపడానికి అవకాశం లేకుండా కాంప్లెక్స్ లో నడిపిస్తున్నారని
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్, లిఫ్ట్ లో సెక్యూరిటీ గార్డు లేకుండా నిర్లక్ష్యంగా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…