
హైటెక్ బస్టాండ్ లో “చిల్లరలొల్లి
చిల్లర పైసల్ ఇవ్వలేదని డ్రైవర్ పై దాడి
సి కె న్యూస్ ప్రతినిధి
సూర్యాపేటజిల్లా :మే 09
కేంద్రంలో ని హైటెక్ బస్టాండ్ లో చిల్లర పైసల వల్ల డ్రైవర్ కి గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న సూర్యాపేట డిపో కు చెందిన ఆర్టీసీ బస్ లో సూర్యపేట పట్టణ నికి చెందిన శ్రవణ్ బస్సు ఎక్కాడు.
500 రూపాయలు ఇచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకున్నాడు.మిగతా చిల్లర హైదరాబాద్ వెళ్లిన తర్వాత తీసుకో అని డ్రైవర్ (కం) కండక్టర్ శ్రీనివాస్ ప్రయాణికుడు శ్రావణ్ తో అన్నాడు.దాంతో తనకి మిగతా చిల్లర ఇప్పుడే ఇవ్వాలని ప్రయాణికుడు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు.
ఇద్దరి మధ్య మాట మాట పెరిగి.ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ పై మజ్జిగ పొసే గరిటే తో ప్రయాణికుడు శ్రావణ్ దాడి చేశాడు. శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గాయపర్చిన శ్రవణ్ ను ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించారు.