హోలీ శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం లంబాడి కుల పెద్దలు

హోలీ శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం లంబాడి కుల పెద్దలు
భద్రాచల ఏఎస్పి పారితోష్ పంకజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ తానాజీకి మరియు భద్రాచలం సిఐ నాగరాజు రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం లంబాడి కుల పెద్దలు
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మార్చి 07,
భద్రాచలం నియోజకవర్గం లో ఉన్న లంబాడి సోదరులు సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా ముందుగా అందరము ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ తానాజి దగ్గరికి, భద్రాచలం ఏ ఎస్పి పారితోష్ పంకజ్ దగ్గరికి మరియు భద్రాచలం టౌన్ నాగరాజు రెడ్డికి అందరం కలిసి లంబాడీల సాంప్రదాయ పండుగ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలిపినాము పై అధికారులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకొకూడదని మద్యం సేవించి రోడ్లమీద తిరగరాదని ఏ ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. వాగులు, వంకలు, గోదారికి స్థానానికి వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని వారు తెలిపారు. మనలో ఉన్న చెడుని తొలగించుకోవాలని ఈ సంవత్సరం పాటుగా మనం చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పోయి ఇకనుంచి మనకు మంచి జరగాలి అలాగే సమాజాన్ని కూడా మంచి జరగాలని ఉద్దేశంతో హోలీ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బంజారా తెగ వారు బాగా ఎక్కువగా చేసుకునే పండుగల్లో హోలీ పండుగ ఎన్నో ముఖ్యమైనదని మనతోపాటుగా మార్వాడి సోదరులు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించు కుంటారు భారతదేశంలో దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో హోలీ పండుగను దిగ్విజయంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి లంబాడి సోదరులందరూ సుఖశాంతులతో ఉండాలని లంబాడి సంఘం తరఫున కోరుకుంటున్నాం. బి కృష్ణ, లకావత్ వెంకటేశ్వర్లు, జీ భావ సింగ్, జీ బాన్సిలాల్, జీ గోవిందు, జీ లక్ష్మణ్, బి కోదండ రామ్, జె శ్రీను, వి లక్ష్మణ్, యల్. రాజ్ శేఖర్, బి వీరు, బి బిచ్చ, జీ రామదాసు, బి జూమ్ లాల్, బి మోహన్, తదితరులు పాల్గొన్నారు