Telangana

10th ప్రశ్నాపత్రం లీక్ చేసిన వ్యక్తి ఇతనే?

BREAKING: RR: 10th ప్రశ్నాపత్రం లీక్ చేసిన వ్యక్తి ఇతనే?

VKB జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు పేపరు లీక్ చేశారని అనుమానిస్తూ ప్రభుత్వ పాఠశాల-1 సైన్స్ టీచర్ బందెప్పను పోలీస్ అధికారులు ఈరోజు విచారిస్తున్నారు. గతంలో ఈయనపై ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని కేసు కూడా ఉంది.

బందెప్ప ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ లో పొందుపరచుకొని ఇతరులకు షేర్ చేసేటప్పుడు అనుకోకుండా వాట్సప్ గ్రూపులోకి వెళ్లిపోవడంతో ఈ విషయం బహిర్గతమైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూర్

ఎంతో పకడ్బందీగా నిర్వహించవలసిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ వికారాబాద్ జిల్లా తాండూర్ వాట్సాప్ సోషల్ మీడియా గ్రూపులలో
ముందే చెక్కర్లు కొట్టింది

ఉదయం 9:37కే వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చిన పేపర్ మనది కాదని బుకాయించారు మరోవైపు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 12 గంటల 30 నిమిషాలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది.

దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి రావడం జరిగింది…లీక్ చేసింది బంద్యప్ప అనే ప్రభుత్వ సైన్స్ టీచర్ అని ప్రాథమిక సమాచారం…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected