Telangana
రక్షించే నాయకుడే భక్షిస్తున్నాడని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై నిప్పులు చెరిగిన గడిల శ్రీకాంత్ గౌడ్..

రక్షించే నాయకుడే భక్షిస్తున్నాడని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై నిప్పులు చెరిగిన గడిల శ్రీకాంత్ గౌడ్..
8వ రోజు పూర్తయిన సందర్భంగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు బిజెపి రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ మద్దతు తెలుపుతూ మీడియాతో మాట్లాడారు కేఎస్ఆర్ మైనింగ్ సంస్థ వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయి అని ప్రకృతిని నాశనం చేస్తున్నారు అని దీని ద్వారా గ్రామానికి ముప్పు ఉందని గడిల శ్రీకాంత్ గౌడ్ నిప్పులు చెరిగారు.సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు, లక్డారం గ్రామం పెద్ద చెరువు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమ మైనింగ్ చేస్తున్నారని అన్నారు..
- లక్డారం గ్రామంలో పెద్ద చెరువు ఆయకట్టు సుమారు 450 ఎకరాలకు ఉంటుంది అని దాని కింద రైతులు 650 మంది కుటుంబాలపై ఉంటారు అని ఆ చెరువును నమ్ముకుని సుమారు 3000 ఎకరాల సాగుభూమి ఉంటుంది అని చెరువు మంచిగా నిండి పంట పండిస్తే చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళకందరికీ పని లభిస్తుంటే… వాన కాలంలో యాసంగిలో పెద్ద చెరువు కట్ట పక్కన స్థానిక ఎమ్మెల్యే అండదండలతో మైనింగ్ డిపార్ట్మెంట్ కేఎస్ఆర్ మైనింగ్ సంస్థకు ఇవ్వడం ద్వారా పెద్ద చెరువుకు ప్రమాదంగా మారింది.. 4 ఫీట్లు చెరువు కింద క్వరీ తీయంగానే నీళ్లు వచ్చాయని పెద్ద చెరువు మీద ఆధారపడి ఎంతోమంది రైతులు జీవిస్తున్నారని ఈ మైనింగ్ వల్ల చెరువు పూర్తిగా కాలుష్యం అయ్యే అవకాశం ఉందని వెంటనే కేఎస్ఆర్ మైనింగ్ కి అనుమతులు రద్దుచేసి పూర్తిగా ఈ ప్రాంతం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మాజీ చెరువు చైర్మన్ రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి ,డీ.సీ.పీ కావలి వీరేశం, మహేందర్ రెడ్డి, ముత్యాల రవీందర్ గౌడ్, పి మహేందర్ రెడ్డి ,వడ్ల గోపాల్ ,పృథ్వీ మహేందర్, శ్రీకాంత్, పి. ప్రభాకర్ రెడ్డి ,అనిల్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.