
గత కొన్ని రోజులుగా కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లూ మరియు సోషల్ మీడియా పేజీల్లో YSR తెలంగాణ పార్టీ మరియు పార్టీ అధినేత్రి, వైఎస్ షర్మిల గారి గురించి దారుణమైన, నిరాధారమైన కథనాలు ప్రచురితం మరియు ప్రసారం అవుతున్నాయి. ఈ తప్పుడు సమాచారం మరియు కథనాలు పార్టీ మరియు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు పై కక్షకట్టి చేస్తున్న దాడిగా సుస్పష్టంగా కనిపిస్తున్నది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ వెంటపడుతున్నట్టుగా, ఐదు సీట్లు ఇస్తే చాలు అన్నట్టుగా, క్యాడర్ యావతు కన్ఫ్యూషన్ లో ఉన్నట్టుగా రాసిన ఈ కల్పిత కథనం ఎటువంటి ఆధారాలతో కూడి ఉన్నదో ఆ పత్రిక చెప్పలేదు, ఎందుకంటే వీటికి అధరాలు లేవు. నేటి కలుషిత రాజకీయ వాతావరణం వెదజల్లుతున్న విపరీత ధోరణులతో, పత్రికల నిర్వహణ రాజకీయ పార్టీలకు కొమ్ముకాసేవిధంగా కల్తీ జర్నలిజానికి సుచిగా ఉన్న కాలంలో, ఒక్క యువనాయకురాలికి ప్రజల్లో వస్తున్న ఆదరణను కట్టడిచేసే విధంగా ఈ రాతలు ఉన్నవి అని అనడంలో సందేహం లేదు
గత రెండు సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ, దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఎండనకా, వాననకా, ఊరు ఊరు, జిల్లా జిల్లా తిరుగుతూ, ప్రజలకోసం అలుపెరగక పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే నిస్సందేహంగా వైఎస్ షర్మిల మాత్రమే. కేసీఆర్ నియంతృత్వ పోకడలపై, నీతిమాలిన భారసా పాలనపై, తలవంచక, అదరక, బెదరక, ప్రజలను చైతన్యపరిచిన నాయకురాలు కేవలం షర్మిలే అని అన్నారు
ఆమె అందిస్తున్న స్ఫూర్తి, ప్రభుత్వాన్ని ఎండగడుతున్న విధానాన్ని తట్టుకోలేక కేసీఆర్ సర్కారు ఆమెపై చేయని దాడి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు, వారి వారి స్వార్థపూరిత రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతూ, కేసీఆర్ ను ఎదుర్కోవడంలో విఫలమైతే, వైఎస్ షర్మిలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ వారికి కూడా కంటగింపుగా ఉన్నట్టుంది. అందుకే కూడబలుక్కుని, అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆమెపై, మా పార్టీపై ఇటువంటి కుత్సిత చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ సందర్భంలో మీడియాకు మేము చేసే విన్నపం ఇదే: మీ పత్రికలూ యే యే రాజకీయ పార్టీలకు వెనకుండి వెన్నుదన్నుగా నిలుస్తాయి అది మీ నైతిక విలువలకు, మనస్సాక్షికే వదిలేస్తున్నాం, కానీ ప్రజలకోసం నడుస్తూ, నిలుస్తూ, అడుగడుగు, అణువణువు వారి పోరాటమే తన పోరాటమే ముందుకు సాగుతున్న వైఎస్ షర్మిల పై ఇటువంటి రాతలు మనుకోవటం మంచిది,
మా పార్టీ ప్రణాళికలు, రోడ్డు మ్యాపులు ఎల్లప్పుడూ మేము మీడియాకు మా పార్టీ తరపునే, మా ప్రతినిధుల ద్వారానే తెలియచేస్తున్నాము, తెలియచేస్తూనే ఉంటాము. అంతేకాక క్షేత్రస్థాయిలో క్యాడర్ల ద్వారా ప్రజాపోరాటాలు చేస్తూ, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ, రాష్ట్ర బాగు, భవితను దృష్టిలో పెట్టుకుని మేము ఎల్లప్పుడూ ముందుకు వెళతాం అన్నారు