సైబర్ నేరగాళ్ల వలలో మరో మహిళ

సైబర్ నేరగాళ్ల వలలో మరో మహిళ
మహిళ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మంథని సీఐ బి.రాజు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి తన కుమారుడు చనిపోవడంతో ఆయన ఖాతాలోని రూ.4 లక్షల 49 వేలను తన ఎప్బీఐ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
కొద్ది రోజుల తరువాత డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఆమె ఖాతాలో డబ్బులు లేవని అధికారులు తెలిపారు. దాంతో బాధితురాలు మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దీంతో బ్యాంకు స్టేట్ మెంట్, టెక్నికల్ ఆధారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కాగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ కు చెందిన దామరకుంట అశోక్, గుండ్ర ప్రశాంత్ కుమార్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఈక్రమంలో లక్ష్మి ఫోన్‌కి ఓ లింక్ పంపారు. దాంతో ఆమె దానిని ఓపెన్ చేయడంతో ఆమె ఖాతా నుంచి డబ్బులు కాజేశారు. ఈ మేరకు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. దాంతో ఈ నెల 13న మంథని కోర్ట్ లో నిందితులను రిమాండ్ చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, లింక్ లు, వ్యక్తి గత సమాచారం చెప్పద్దని సీఐ తెలిపారు. సమావేశంలో మంథని ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ లు ఉన్నారు.
