వడ్డీ వ్యాపారి వేధింపులకు మరో యువకుడి బలి

వడ్డీ వ్యాపారి వేధింపులకు మరో యువకుడి బలి

నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రూ.40,000 అప్పు తీసుకున్న పాపానికి రూ.80000 కట్టమని వేధించినందుకు అప్పు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం ముషీర్ నగర్ లో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీర్ నగర్ కు చెందిన మనోహర్ అనే వ్యక్తి గత కొద్దికాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

తన అవసర నిమిత్తం నగరంలోని నాందేవ్ వాడకు చెందిన జ్యోతి అనే మహిళ వద్ద ఆరు నెలల క్రితం 40 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.

అసలు రూ.40000 వడ్డీతో కలిపి రూ.80 వేలు చెల్లించమని మనోహర్ పైన గత కొద్ది కాలంగా ఇంటికి వెళ్లి జ్యోతి మనసులు బెదిరించి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురై గడ్డి మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స కొరకు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.

Ck News Tv

Ck News Tv

Next Story