![రాజన్న సిరిసిల్లా జిల్లాలో బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు మండల కమిటీల నియామకం........ రాజన్న సిరిసిల్లా జిల్లాలో బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు మండల కమిటీల నియామకం........](https://cknewstv.in/h-upload/2025/02/06/1974272-whatsapp-image-2025-02-06-at-40429-pm.webp)
రాజన్న సిరిసిల్లా జిల్లాలో బీసీ సాధికారిత సంఘం బలోపేతం కొరకు మండల కమిటీల నియామకం.
వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారిత సంఘం కార్యాలయం లో ఈ రోజు పొలాస నరేందర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు గారి అధ్యక్షతన జరిగిన ,జిల్లా బీసీ సాధికారిత సంఘం సమావేశంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బీసీ సాధికారిత మండల కమిటీలను ,మండలాలవారిగా మండల అధ్యక్షులను మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించి వారికి నియామక పత్రాలు అంధజేసి వారినీ మర్యాదపూర్వకంగా రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య గారు సన్మానించారు.
తదుపరి జరిగిన సమావేశంలో కొండ దేవయ్య గారు మాట్లాడుతూ జిల్లాలో బీసీ సాధికారిత సంఘం పటిస్టవంతంగా ఉండుటకు గాను,బీసీలను ఐక్యపరుచుటకు గాను,బీసీల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయుటకై జిల్లాలో మందలాలవారిగా మండల అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియమించడం జరిగిందని దేవయ్య అన్నారు.
రాజన్న సిరిసిల్లా జిల్లాలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా, ఉత్తర తెలంగాణ జిల్లాలలో బీసీ సాధికారిత సంఘంను బలో పే తం చేస్తామని కొండ దేవయ్య అన్నారు..
జిల్లా బీసీ సాధికారిత సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పోలాస నరేందర్ మాట్లాడుతూ, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఉపాధి పరంగా మరియు తదితర రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో బీసీ సాధికారిత సంఘం పని చేస్తుందని నరేందర్ అన్నారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలన్న ,బీసీలకు రాజ్యాధికారం రావాలన్న, రోజు,రోజుకు అంతరించిపోతున్న కుల చేతి వృత్తులకు కాపాడుకోవాలన్న,బీసీ కులాలకు కులవృత్తుల ద్వార పూర్వవైభవం రావడం కొరకు బీసీలు ఐక్యంగా శ్రమించాల్సిన అవసరం ఎంతో ఉన్నదనీ,ఆ సమయం ఆసన్నమైందని పొలాస నరేందర్ బీసీ సంఘాలకు పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కుల సర్వే పారదర్శకంగా,పటిస్టవంతంగా, సృజనాత్మకంగా ,సంపూర్ణంగా,జరుగనందున మళ్లీ సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని నరేందర్ కోరారు.
జగిత్యాల జిల్లా బీసీ సాధికారిత సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలుగా పూడూరు గ్రామానికి చెందిన గాదె శ్రావంతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసి,సన్మానించడం జరిగింది
సమావేశంలో పాల్గొన్నవారు
తీగల శేఖర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గాదె శ్రావంతి జగిత్యాల చేను జిల్లా మహిళ అధ్యక్షురాలు,గుజ్జెల శివరాం జిల్లా యువత ప్రధాన కార్యదర్శి,ఇల్లందు వెంకటేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి, రౌతు స్వప్న,సిరిగిరి గాయిత్రి,పావని గౌడ్,అనురాధ ,కుంభం రవీందర్,ఉయ్యాల భూమయ్య, చేను హెలపతి తో పాటుగా తదితరులు పాల్గొన్నారు..
![Admin Admin](/images/authorplaceholder.jpg?type=1&v=2)