గ్రామపంచాయితీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యం

గ్రామపంచాయితీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యం
టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ
కె.సి.అర్ నీవు ఎన్ని కుట్రలు పన్నినా రేవంత్ రెడ్డి యాత్ర అపలేవు,కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎదురు లేదు: ఏడవల్లి
హత్ సే హత్ జోడో యాత్రలో ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగిన : ఏడవల్లి
బి అర్ యస్ అలియాస్ బిజేపి ప్రభుత్వాల నూకలు చెల్లినవి :ఏడవల్లి
సికే న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మార్చి 02
కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామపంచాయితీ లో టిపీసీసీ జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో హత్ సే హత్ అభియాన్ జోడో యాత్రలో లీనమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏమి చేస్తుంది అని వివరించుకుంటు కరపత్రాలు ఇంటింటికీ వెళుతూ ప్రజలకు అందజేస్తు వారి సమస్యలు వింటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగిన యాత్ర, కార్యక్రమములో భాగంగా ఏడవల్లి మాట్లాడుతూ బి అర్ యస్ అలియాస్ బిజేపి ప్రభుత్వాలు ఇక వారి దుకాణాలు మానుకొని ఇంటిలో కూర్చునే రోజులు దగ్గరలో ఉన్నాయని నిను కొత్తగూడెం నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ప్రతి గ్రామములో మరియు పట్టణ వార్డులో అనేక మంది ప్రజలు బి అర్ యస్, బిజెపి ప్రభుత్వాలపై తీవ్ర వ్యేతిరేకతతో ఉన్నారని అదేవిధంగా ఈ రోజు అశోక్ నగర్ లో మహిళలు,వృద్దులు,చదువుకున్న యువత వారి వారి సమస్యలు చెప్పుకోనీ కన్నీటిపర్యంతమయ్యారు ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం కానీ వాటిని ఒక్కటి కూడా అమలు చేయడం లేదు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇంటిలో ఉంటున్నాం,దళితులకు మూడు ఏకరాలు అన్నాడు ఏమి పోయింది అని దుమ్మెత్తి పోతున్నారు ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మాకు న్యాయం జరిగిందని ప్రజలు తెలుపుతున్నారు ఏమయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడమే కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద దాడి చేపిస్తున్నవు నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు మా నాయకుడు రేవంత్ బంతి లాంటి వారు మీరు ఎంత కొడితే అంత పైకి లేస్తాడు ప్రజా సమస్యలు తెలుసుకోవడనికి వస్తె దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు సమంజసం,కే సీ అర్ నీవు ఎన్ని కుట్రలు కుతత్రాలు పన్నినా రేవంత్ అన్న యాత్ర అపలెవు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎదురు లేదు,పంచాయితీలలో నిధులు రాక అనేక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నీ సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాద్య పడుతుందినీ టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు
ఈ కార్యక్రమములో కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,పట్టణ మహిళ అధ్యక్షురాలు జెరిన, లక్ష్మీదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,పట్టణ యస్సీ సెల్ అధ్యక్షులు కళ్లేపల్లి రాజా,చుంచుపల్లి మండల బీసీ సెల్ నాయకురాలు రాజ్యలక్ష్మి,మైనార్టీ నాయకులు అక్బర్,ఫైజుద్దిన్,కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి సత్యనారాయణ, రామ్ నాయక్,పట్టణ ఎస్టీ సెల్ నాయకులు భూక్యా శ్రీనివాస్,యూత్ నాయకులు శనగ లక్ష్మణ్,థామస్,మొద్దు శ్రీనివాస్,పుర్మ వినోద్,పవన్,రాజు,గణేష్,అవినాష్,నరేష్, రాము,సందీప్ దీక్షిత్,శ్రీను తదితరులు పాల్గొన్నారు