Badradri

రేవంత్ రెడ్డిపై బి ఆర్ ఎస్ గూండాల దాడి అమానుషం

రేవంత్ రెడ్డిపై బి ఆర్ ఎస్ గూండాల దాడి అమానుషం.

దాడికి-ప్రతిదాడి చేయడం కంటే ప్రజాస్వామ్య విలువలే మాకు ప్రాధాన్యం…!!

ప్రజాస్వామ్యంలో “రాజకీయ పార్టీలు” హుందాతనంతో వ్యవహరించాలి…

దాడులు చేసుకుంటూ పోవాలంటే ఆయా నియోజకవర్గాల్లో ఏ ఒక్కరూ రోడ్లపై తిరగలేరు…

రేవంత్ రెడ్డిపై జరిగిన దాడికి-ప్రతిఘటనగా నియోజకవర్గంలో భారీ నిరసన చేపట్టిన కాంగ్రెస్..

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డీసిసి అధ్యక్షులు-పెద్దలు పొదేం-నియోజకవర్గ క్యాడర్…!!

సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 02,

యాత్ర ఫర్ చేంజ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రేవంత్ రెడ్డిచేపడుతున్న హథ్ సే హథ్ జోడో యాత్ర లో భాగంగా…
మొన్న జరిగిన భూపాలపల్లి కార్నర్ సభలో రేవంత్ రెడ్డిపై అక్కడి స్థానిక ఎం ఎల్ ఏ- బి ఆర్ ఎస్ కి అమ్ముడుపోయిన గండ్ర వెంకటరమణారెడ్డి- ఆయన అనుచర గూండాలు- కొంతమంది అల్లరిమూకలు- చిల్లర నాయకులు ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా సభపై దాడిచేయడం అమానుషమని…
స్వాతంత్ర్య భారతదేశంలో- రాజ్యాంగ ప్రతిపత్తికలిగిన పార్టీలు ప్రజలతరపున-ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా సభలు-సమావేశాలు పెట్టుకొనే హక్కుందని… అందులో భాగంగానే కాంగ్రెస్ సభ నిర్వహిస్తుండగానే దాడిచేయడం ఎంతమాత్రం సమంజసమో బి ఆర్ ఎస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని…
ఒకవేళ అక్కడి ఎం ఎల్ ఏ చేసిందే నీతి-న్యాయమైతే
మీ ఎం ఎల్ ఏ ల నియోజకవర్గాల్లో మీపై కూడా అవే గుడ్లు-టమాటాలతో పాటుగా చెప్పులుకూడా పడేరోజులు చవిచూడాల్సొస్తుందని…
జరిగిన సంఘటనపై స్థానిక ఎం ఎల్ ఏ-నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులను హెచ్చరించడం జరిగింది…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు- టిపిసిసి సభ్యులు తాళ్లూరి చక్రవర్తిగారు-బట్టా విజయ్ గాంధీ
ఐ టి సి మాజీ యూనియన్ నాయకులు&పెద్దలు ఐ ఎన్ టి యు సి రాష్ట్ర విభాగ నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి
కణితి కృష్ణ మండల కాంగ్రెస్ కమిటీ యంత్రాంగం దుగ్గెంపూడి కృష్ణారెడ్డి-పూలపెళ్లి సుధాకర్ రెడ్డి-చల్లా వెంకటనారాయణ-మందా నాగరాజు-బెల్లంకొండ వాసుదేవరావు-జిల్లా మినార్టీ నాయకులు ముహమ్మద్ ఖాన్ -నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షులు పోతురెడ్డి శ్రీనివాస రెడ్డి-మహిళా కాంగ్రెస్ గోణే రేణుక-కళ్యాణ్-దేవి-కామేశ్వరి గారు-పలు గ్రామాల సర్పంచులు-తాటి వీరాంజనేయులు-పాయం వెంకటేశ్వర్లు-సెర్పా వెంకటేశ్వర్లు-సీనియర్ నాయకులు-పెద్దలు బొర్రా భద్రయ్య సరియం కృష్ణమూర్తి-బోర్రా సత్యనారాయణ -యువజన కాంగ్రెస్ శ్రేణులు-రహీం- కుంజా ప్రవీణ్-కొరసా వెంకట్-వీరబాబు-రైతులు-ప్రజలు-మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు-కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు- ఐ ఎన్ టి యు సి ప్రతినిధులు-పార్టీ కార్యకర్తలు-సోషల్ మీడియా కో ఆర్డినెటర్ ముర్రం రాంబాబు&సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected