వలస గిరిజనేతరుల వ్యాపార లైసెన్సులు రద్దు చేయాలి:
వలస గిరిజనేతరుల వ్యాపార లైసెన్సులు రద్దు చేయాలి

వలస గిరిజనేతరుల వ్యాపార లైసెన్సులు రద్దు చేయాలి:
సీకె న్యూస్ ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం ప్రతినిధి.(ప్రశాంత్).
మే04.
వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్ భూభాగంలో1/59,1/70 చట్టాల కు విరుద్ధంగా 1970 సం” తరువాత వలస గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బహుళ అంతస్తులు, ఏజెన్సీచట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు అక్రమ వ్యాపారం లైసెన్స్ మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
1/59, 1/70 (డి )ప్రకారం అక్రమ వ్యాపార లైసెన్సులు మరియు అక్రమ నిర్మాణాలు నిరోధించే అధికారం ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నప్పటికీ ఎటువంటి స్పందన లేనందున ఆదివాసి సంక్షేమపరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రహైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. 1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతరుల వ్యాపార లైసెన్సులు రద్దు చేయాలన్నారు.
బహుళ అంతస్తుల పై LTR కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తుర్స క్రిష్ణ బాబు, మడప సతీష్ ,తుర్స చంటి, కుర్సం శంకర్, మహేష్, మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.