40 మందికి ఉగాది పురస్కారాలు.

40 మందికి ఉగాది పురస్కారాలు.
ప్రముఖ సంఘ సేవకులు ఎల్ ఎన్ గాదె మాధవరెడ్డి అధ్యక్షతన జరిగింది.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 09,
భద్రాచలంలో రాఘవ నిలయం నందు జరిగినటువంటి కార్యక్రమం ఓసి సంఘర్షణ సమితి
ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వివిధ రంగాలలో అత్యున్నతమైన సేవలందించి నటువంటి 40 మందికి ఉగాది పురస్కారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం భద్రాచల పట్టణ ప్రముఖులు ప్రముఖ సంఘ సేవకులు ఎల్ ఎన్ గాదె మాధవరెడ్డి అధ్యక్షతన జరిగింది ఓ సి సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి నేతృత్వంలో వివిధ రంగాలలో ప్రతిభావంతు లైనటువంటి వారిని గుర్తించి వారికి .సేవా రత్న .విద్యారత్న. న్యాయవాదిరత్న. ఉన్నత సేవా రత్న. జ్ఞాన రత్న. అవార్డులని అందించడం జరిగింది వారి వారి సేవలను గుర్తిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని మిగతావారు కూడా ఇటువంటి సేవలు అందించాలని అధ్యక్షత వహించిన గాదె మాధవరెడ్డి పిలుపునిచ్చారు. సదాశివరెడ్డి మాట్లాడుతూ ఈ 10 సంవత్సరాలలో ఎన్నో రంగాలలో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారిని గుర్తించి మా సంస్థ ద్వారా సత్కారాలు ఇస్తూ వచ్చామని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సీతారాముల వారి పాటలు అలరించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో అవార్డు తీసుకున్న వారు. వారి వారి అనుభవాలన్నీ తెలియజేశారు ఓసి సంఘర్షణ సమితి పదవ వార్షికోత్సవం భద్రాచలంలో జరుపుకోవడం చాలా సంతోషమని వక్తలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి .కార్యక్రమ నిర్వహకులు గాదె మాధవరెడ్డి. పాకల దుర్గాప్రసాద్. మంజునాథ రెడ్డి. న్యాయవాది శ్రీదేవి రెడ్డి. సానికొమ్ము శంకర్ రెడ్డి. ఎస్.కె అజీమ్. మస్కట్ నదీమ్. చారుగుల్ల శ్రీనివాస్. సింగర్ వాణి రామ్. పెద్దిరాజు. రామలక్ష్మి. చంద్రం. రామావజ్జుల రవికుమార్. బిపిఎల్ కాంట్రాక్టర్ రఫీ. సన్మాన గ్రహీతలు పట్టణ ప్రముఖులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు