తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య

తెలంగాణలో విషాదం.. మరో రైతు ఆత్మహత్య

ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి విషాద ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటలోని మోతె మండలంలో గణేష్ అనే ఓ రైతు ఉన్నాడు. ఇతనికి రెండు ఎకరాల పొలం ఉంది.

దీనికి మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని, అందులో మిర్చి, పత్తి పంటను సాగు చేస్తున్నాడు.

తక్కువ ధరకు ఎందుకు విక్రయించావని..

డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసి మరి మిర్చి సాగుకి పెట్టుబడి పెట్టాడు. ఏడాది అంతా కష్టపడినా కూడా క్వింటాన్నర మాత్రమే దిగుబడి వచ్చింది.

ఈ మిర్చిని మార్కెట్లో విక్రయించగా కేవలం రూ.19 వేలు మాత్రమే రైతు చేతికి అందాయి. అయితే ఇంత తక్కువ ధరకు ఎందుకు విక్రయించావని భర్తను భార్య నిలదీసింది.

ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో భర్త.. పొలం దగ్గర పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Ck News Tv

Ck News Tv

Next Story