మీకు ఇందిరమ్మ ఇళ్ళు రాలేదా తెలుసుకోండి ఇలా!
మీకు ఇందిరమ్మ ఇళ్ళు రాలేదా తెలుసుకోండి ఇలా!

*మీకు ఇందిరమ్మ ఇళ్ళు రాలేదా తెలుసుకోండి ఇలా!*
దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉంది? సర్వే చేశారా లేదా? ఇల్లు మంజూరైందా లేదా? ఏ జాబితాలో పేరు వచ్చింది? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్ రూపొందించింది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభానికి ముందు అర్హుల జాబితాను ప్రకటించింది ప్రభుత్వం. అయితే, గ్రామసభల్లో ప్రకటించిన జాబితాలో చాలా మంది అభ్యర్థుల పేర్లు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఆన్‌లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన అనంతరం క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రిపోర్టులు పంపించగా చాలా మందికి ఇందిరమ్మ ళ్లు మంజూరయ్యాయి. అయితే, మంజూరైన విషయం గానీ, ఏ జాబితాలో పేరు ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి స్టేటస్ తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్ ప్రారంభించింది. ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ సాయంతో ఫోన్లోనే స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మీ పేరు ఉందా తెలుసుకోండిలా..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
https://indirammaindlu.telangana.gov.in/applicantSearch?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
సెర్చ్ బై ఆధార్ నెంబర్/ ఫోన్ నెంబర్/ రేషన్ కార్డు/అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.
వీటిలో ఏదైనా ఓ నెంబర్ ఎంటర్ చేసి Goపై క్లిక్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన వివరాలు చూపిస్తుంది.
ఈ వివరాల్లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా లేదా? ఏ జాబితాలో వచ్చింది. ఏ దశలో ఉంది? ఇలా వివరాలన్నీ చూపిస్తుంది.
ఇక, దరఖాస్దుదారులకు ఏవైనా అభ్యంతరాలున్నా.. ఈ వెబ్‌సైట్ ద్వారానే ప్రభుత్వానికి తెలపవచ్చు.
మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్కు కాల్ చేయడంతో ద్వారా అభ్యర్థులు తమకు కావాల్సిన వివరాలను పొందవచ్చు.
