సన్న బియ్యం ఇస్తారనుకుంటే నూకలు ఇచ్చారు

సన్న బియ్యం ఇస్తారనుకుంటే నూకలు ఇచ్చారు
మక్తల్ : పేదోడు కూడా ఉన్నోడిలా సన్న బియ్యం బువ్వ తినాలని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యంలో నూకల (కటింగ్) తో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరాతో ఆదిలోనే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్నది.
ఎంతో సంతోషంగా సన్న బియ్యం తీసుకుందామని వెళ్లిన వినియోగదారునికి నూకలతో కూడిన బియ్యం అందించడంతో ఆశ్చర్యపోయిన వినియోగదారుడు ఇదేమని డీలర్ ను ప్రశ్నించగా సివిల్ సప్లై గోదాం నుండి వచ్చిన బియ్యం ఇస్తా అంటున్నారు.
ప్రధాన గోదాం నుండి జిల్లా సివిల్ సప్లై అధికారులు రేషన్ దుకాణాలకు సరఫరా చేసే సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి మంచి బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది.
కాని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అందించే బియ్యం లోడును క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పుడు రైస్ మిల్లర్లతో అధికారులు కుమ్ముక్కై నూకలతో కూడిన బియ్యానికి ఓకే చెప్పడంతో పరిస్థితి ఇలా దాపురించిందని, నూకల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు చేరడం వాటినే వినియోగ దారులకు పంపిణీ చేయడంతో ప్రజల నుండి ప్రభుత్వం విమర్శలను మూటగట్టుకుంటుంది.
పట్టణానికి చెందిన ఉప్పరి నారాయణ కార్డ్ హోల్డర్ సన్న బియ్యం వచ్చాయని సంతోషంతో రేషన్ షాపునకు వెళ్లి బియ్యం తీసుకున్నాడు. ఈ బియ్యంలో నూకలు ఉండడం గమనించి ఏమని డీలర్ను ప్రశ్నించగా షాప్ లో ఉన్న ప్రతి బస్తాన్ని తనిఖీ చేస్తే ప్రతి బస్తాలో నూకల కలిసిన బియ్యం ఉన్నాయి.
అందులో కిలో బియ్యం తీసుకుని జల్లెడ పట్టగా 15 నుంచి 20 గ్రాముల నూకలు కలిసి ఉన్నాయని, బియ్యం అన్నం వండితే ముద్ద అవుతుందని. తినలేక పోతామని ఆయన అంటున్నారు.
సీఎంఆర్ ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్ రైస్ మిల్లర్లు ధాన్యం మరాడించేప్పుడు 20% నూకలు వచ్చేలా మిషన్ లో జన్నిని (జల్లేడ)వాడ్డం వల్లా కటింగ్ బియ్యం వస్తాయని. ఇది బహిరంగ రహస్యమే అని వీటికి బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఉన్నందున మిల్లు యజమానులు ప్రభుత్వానికి సరఫరా చేస్తుంటారని.
ప్రధాన గోదాంకు వెళ్లిన బియ్యం లోడ్ ను ఓకే చెప్పడానికి జిల్లా సివిల్ సప్లై గోదాం అధికారులను మేనేజ్ చేస్తారని. నిర్లక్ష్యం, అవినీతి వల్ల సన్న బియ్యం కాస్త నూకల బియ్యం అయ్యాయని వినియోగదారులు అంటున్నారు.
ప్రజలకు సన్న బియ్యం ప్రభుత్వం చెబుతున్న దానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం బదనాం కావాల్సి వస్తుందని, ప్రజలకు ప్రభుత్వం సన్నబియ్యం సరిపరాలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు సన్న బియ్యం అందించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు కృషి చేయాలని వినియోగదారులు అంటున్నారు.
