నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం..ఇద్దరి అరెస్ట్
నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం..ఇద్దరి అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం..ఇద్దరి అరెస్ట్
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం కేటుగాళ్లు అక్రమ మార్గాన ఫేక్ సర్టిఫికెట్ లు సృష్టించి చదువ కుండానే చదివినట్టు డిగ్రీ 2017 పట్టా పొంది ప్రభుత్వ వ్యవసాయ శాఖ లో ఉద్యోగం సాధించారు కొందరు.
వివరాలలోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ ల ద్వార సుమారు ఐదు మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ పట్టణం లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివినట్టు పత్రాలను సృష్టించి ప్రభుత్వ వ్యవసాయ శాఖ లో ఏ ఈ వో గ్రేడ్ 2 ఉద్యోగం సాదించారు. ఎంచక్కా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ సొమ్ము జీతం పొందుతూ ఉద్యోగం లో స్థిరపడిపోయారు.
ఇక నకిలీ సర్టిఫికెట్ ల గుట్టు బయట పడదని దర్జాగా ఉండగా సర్టిఫికెట్ల తనిఖీ లో భాగంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ వారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కళాశాలల్లో వెళ్ళి విచారించగా అక్కడ ఆ కళాశాలల్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదని సర్టిఫికెట్ లు కూడా ఆ కళాశాలకు సంబంధం లేదని తేలిపోయింది. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సంగీత లక్ష్మి పట్టణ పోలీస్ స్టేషన్ లో 15.03.2024 న ఫిర్యాదు చేయడం జరిగింది.నరేష్,జగదీష్,శివ శంకర్,రవీందర్,జెరూపుల డాక్య లపై ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి నకిలీ సర్టిఫికెట్ లు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేసిన ఐదు మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి శనివారం ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది.నకిలీ సర్టిఫికెట్ లకు కారకుడైన మిర్యాలగూడ ప్రిన్సిపుల్ బాలకృష్ణ పై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని మిగతా వారిని తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. ఆయన వెంట సీఐ టంగుటూరి శ్రీనివాసులు, ఎస్ఐ కళ్యాణ్ కుమార్ లు పాల్గొన్నారు.
