Khammam

భర్త అత్తమామ వేధిస్తున్నారు

భర్త అత్తమామ వేధిస్తున్నారు

భర్త అత్తమామ ప్రతి రోజు వేధిస్తున్నారంటు MLA మెచ్చా నాగేశ్వరరావు ముందు కంట తడి పెట్టుకున్న మహిళ

న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేను వేడుకున్న వివాహిత.

-తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రావణ్ కుమార్కు ఆదేశం.

పర్యటనలో భాగంగా అశ్వారావుపేట(నియోజకవర్గం),దమ్మపేట(మండలం), మందలపల్లి గ్రామంలోనీ ప్రకాష్ నగర్ కాలనీలో జరుగుతున్న శుభకార్యానికి హాజరవడానికి వెళ్తున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నీ అదే కాలనీకు చెందిన ఓ వివాహిత ఎర్రటి ఎండలో చంటి బిడ్డను ఎత్తుకొని రోడ్డుపై నిల్చుంది.

మహిళను గమనించిన ఎమ్మెల్యే కారు అపి ఎర్రటి ఎండలో చంటి బిడ్డను ఎత్తుకుని ఎందుకు నిల్చున్నారు అనీ ప్రశ్నించగా.. కంట తడి పెట్టుకుంటు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త మరియు అత్తమామ ఇంట్లో నుండి నెట్టి వేసి రోజు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని, మీరు ఈ కాలనీకి వస్తున్నారని తెలిసి తాను పడుతున్న ఇబ్బందిని బాధను తమతో చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్ననని అనడంతో వెంటనే చెల్లించిపోయిన MLA మెచ్చా నాగేశ్వరరావు అక్కడే ఉన్న ఎస్సై శ్రావణ్ కుమార్ కి బాధిత మహిళ సమస్యను వెంటనే తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో మహిళ ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected