మొక్కజొన్న వరి రైతులను పరామర్శించిన టీపీసీసీ సభ్యులు రాంమ్మూర్తి నాయక్.

మొక్కజొన్న వరి రైతులను పరామర్శించిన టీపీసీసీ సభ్యులు రాంమ్మూర్తి నాయక్.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండల పరిధిలోని చిన్న మునగాల గ్రామ ప్రాంతంలో కాలువ నీళ్లు అందక ఎండిపోయిన మొక్కజొన్న వరి పంట పొలాలను పరిశీలించిన, బాధిత రైతులను పరామర్శించిన వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ .
చేతికందిన పంటలు సరైన నీళ్ల వసతులు లేక, పక్కనే ఉన్నటువంటి కాలువలోనుండి నీళ్లు రాక ఎండిపోయినటువంటి మొక్కజొన్న వరి పంట పొలాల రైతులు మాట్లాడుతూ— ఎన్నో ఆశలతో పంటలు వేసి, పెట్టుబడి కి డబ్బులు లేక,వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి పంటలు వేస్తే పంట పొలాల కొరకు కాలువలు నీళ్లు వదలకుండా తమ పొట్టను కొడుతున్నారని, రైతుల బాధలు పట్టని ప్రభుత్వం ఎందుకని బోరున విలపిస్తూ తమ గోడును టిపిసిసి సభ్యులు రాంమ్మూర్తి నాయక్ కి విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ—
ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి రైతుల బాధలు కనిపించట్లేదని, 24 గంటల త్రీఫేస్ కరెంట్ ని 12 గంటలు చేశారని, 12 గంటలను కాస్త 5,6 గంటలే చేశారని, రైతులకు అనుకూలంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారని, ఇష్టం వచ్చినట్టు రైతులతో ఆడుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని, ధరణి దరిద్రం రైతుల పాలిట శాపమని, రైతు రుణమాఫీ లేదని, దేశానికి వెన్నుముకైన రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకని నిలదీస్తూ, రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని మన కష్టాలు తీరబోతున్నాయని ఆ రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చిన రాంమ్మూర్తి నాయక్ .
ఈ కార్యక్రమంలో కట్ల రంగారావు, సంతోష్, నాగరాజు, రత్తయ్య, రాజేష్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.