Khammam
సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ , ఎంపీటీసీ

అన్నారుగూడెంలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ మారెళ్ల మమత, ఎంపీటీసీ విజయమ్మ…….
అన్నారుగూడెం గ్రామపంచాయతీ లోని సిసి రోడ్లకు సర్పంచ్ మారెళ్ళ మమత ఎంపిటిసి గోవింద విజయమ్మ, సోమవారం సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మారెళ్ళ మమత మాట్లాడుతూ గ్రామపంచాయతీలో అన్ని సిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానిక గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, ఎంపీటీసీ గోవింద విజయమ్మ, సెక్రటరీ వేణు, మాజీ ఎంపిటిసి జోసెఫ్ తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య వార్డ్ నెంబర్లు సైదా లాల్ బేగ్ , నరసింహారావు,భవని స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు యువకులు పాల్గొన్నారు