
పంజాగుట్టలోని NIMSలో నర్సుల ఆందోళన
హైదరాబాద్ పంజాగుట్టలోని NIMSలో నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు పెద్ద సంఖ్యలో నర్సులు బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాత్రి నుంచి నర్సులు ఆందోళనకు దిగగా.. ఇంకా నిరసన కొనసాగుతోంది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా NIMSలో ఇతర వైద్య సేవలు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించే అంతవరకు ఆందోళన ఆపేది లేదని వారు వెల్లడించారు.