తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట.. ఆ కేసు కొట్టివేత
తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట.. ఆ కేసు కొట్టివేత

తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట.. ఆ కేసు కొట్టివేత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఊరట దక్కింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో 2020 మార్చిలో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
జన్వాడలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి, మరికొంత మందిపై అప్పట్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 2020 మార్చిలో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అదే నెల ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని చెప్పారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు నార్సింగి పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జన్వాడ ఫాంహౌసుపై రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయించారని 2020 మార్చిలో కేసు నమోదైంది. నిషేధిత ప్రాంతంలో డ్రోను ఎగరవేశారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో ఇదే విషయం హాట్ టాపిక్ అయింది. కేటీఆర్‌పై అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
