త్వరలో రెండు రకాల రేషన్ కార్డులు

తెలంగాణలో రేషన్ కార్డులు జారీపై రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు.

తెలంగాణలో ఇకనుంచి రెండు రకాలుగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. దారిద్రవేతకు దిగువన ఉన్నవారికి మాత్రమే బిపిఎల్ కార్డులు ఇవ్వనున్నారు. దారిద్ర రేఖకు పైన ఉన్నవారికి ఐపీఎల్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. బిపిఎల్ కార్డులను మూడు రంగులు కనిపించేలా, ఐపీఎల్ కార్డులను గ్రీన్ కలర్ లో జారీ చేయాలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని విమర్శలు ఉన్నాయి. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డుల జారిపై ఫోకస్ చేసిందన్నారు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి. ఇదివరకే పలుమార్లు కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు తీసుకున్నారు. ఏడాది జనవరి 26న కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని రేషన్ కార్డులు జారీ చేయడం తెలిసిందే. నాలుగు రోజులపాటు గ్రామసభలు ఏర్పాటు చేసి మరి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే నిరాశ మిగిలింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు జారీలో జాప్యం జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని 8 జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతి కుమారిని ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది.

స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు

అసెంబ్లీలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో రేషన్ కార్డులపై స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం 2.8 కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఉన్నారు. రేషన్ కార్డుల తయారీ సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచాం. మార్చు నెలాఖరులలో గా ఆ ప్రక్రియ పూర్తి కానుంది. అర్హులైన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీచేస్తుంది. ప్రభుత్వం రెండు రకాలుగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు జారీ కానున్నాయి. పింక్ కలర్ కార్డులో ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు వస్తాయి. పాత కార్డులు ఉన్నవారికి పాటి స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. రెండు దఫాలు అధికారంలో ఉన్నా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు (SLBC Tunnel Project)ను కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రోబోలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇటీవల ప్రమాదం జరగకపోయుంటే SLBC టన్నెల్ పనులు రెండేళ్లలో పూర్తయ్యేవి. నేను ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచాను. పలుమార్లు మంత్రిగా చేశాను. నాకు కొత్త ఆశలు లేవని’ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated On 14 March 2025 9:38 AM IST
Ck News Tv

Ck News Tv

Next Story