వనపర్తిలో మంత్రి పేరు చెప్పుకుని బెల్లం అమ్మకాలు; ధర్నా*

- *వనపర్తిలో మంత్రి పేరు చెప్పుకుని బెల్లం అమ్మకాలు; ధర్నా*
వనపర్తిలో మంత్రి పేరు,అధికారుల పేరు చెప్పుకుని బెల్లం అమ్మకాలు నిర్వహించి ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల పక్షం ఐక్యవేదిక వారు బెల్లం గది ముందు ధర్నా చేశారు. బెల్లం ఎక్కువ రేట్లకు అమ్మి
లక్షల్లో లాభాలు గడిస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక నేతలు కోరారు.వనపర్తిలో
బెల్లం పేరుతో మాఫియాను అరికట్టాలని, వర్తక సంఘం పేరుతో బెల్లం అమ్మకాలను అరికట్టాలని కోరారు. ప్రజలకు బెల్లం 50 రూపాయలకే అమ్మాలని, ప్రజలను మోసం చేస్తున్న వారిని ఆరెస్ట్ చేయాలని అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. బెల్లం పేరుతో కమిషన్లు తింటున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను, మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. వనపర్తి జిల్లాలో బెల్లం పేరుతో మాఫీయాగా ఏర్పడి బెల్లం విక్రయాలు సాధారణ కిరణాలకు చెందకుండా తమతో ఉంచుకుని కొందరు ప్రజాపతినిధులకు కమీషన్లు ఇస్తూ, అధికారులకు లంచాలు ఇస్తూ, 40 రూపాయల బేల్లాన్ని సాధారణ రోజుల్లో 80 రూపాయలకు, పండుగల సందర్భంగా వంద నుండి 120 రూపాయలకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూన్నారని తెలిపారు. బెల్లం దళారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, పక్క జిల్లాలలో 42, 45 రూపాయలకు బెల్లం అమ్ముతున్నారని చెప్పారు.వనపర్తిలో నేటి నుండి ఉగాది పండుగ వరకు బెల్లం 50 రూపాయలకే ప్రతి కిరాణాల్లో అమ్ముటకు ఎక్సైజ్ శాఖ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వనపర్తి పట్టణంలో
అక్రమంగా విక్రయించే బెల్లాన్ని ప్రజలు ఉచితంగా తీసుకెళ్తారని, వారు తమ చేతుల్లోకి తీసుకోకముందే దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
లారీలలో తెచ్చిన బెల్లం సంచులను వనపర్తి వర్తక సంఘం ఆఫీసులో పెట్టి 30 కిలోల బ్యాగు 1600 రూపాయలకు చిన్న షాపుల వారికి అమ్ముతున్నారని, వారు కిలో బెల్లాన్ని 80 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు.పండుగల పూట నూరు నుండి 120 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. అఖిలపక్ష ఐక్యవేదిక బెల్లం డంపు చేసిన దగ్గరకు వెళ్లి ధర్నా చేశారు. అనంతరం వనపర్తి ఎక్సైజ్ సిఐ సుభాష్ చందర్ రావుకు వినతిపత్రం అందజేశారు.
వనపర్తిలో సాధారణ రోజుల నుండి పండుగ వరకు 45 రూపాయలు నుండి 50 రూపాయలు వరకు బెల్లం అమ్మాలని కోరారు. దళారుల మాటలు విని సారా తయారు చేసే వారికి బెల్లం అమ్ముతున్నట్లు కారణం చూపి కిరాణం దుకాణాలపై కేసులు నమోదు చేస్తే ధర్నా చేస్తామని .వనపర్తిలో ధనవంతులకు,
మంత్రి పేరు చెప్పుకుని బెల్లం వ్యాపారం చేసే వారికి,పరోక్షంగా సహకరించే అధికారులకు భయపడే ప్రసక్తి లేదని,వారిపై హైకోర్టుకు,లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. కిరాణం దుకాణాల్లో అమ్మాల్సిన బెల్లం వర్తక సంఘం కార్యాలయంలో అమ్మాలని ఏ చట్టంలో ఉంది,కేసీఆర్, కేటీఆర్, జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.వనపర్తిలో అధికారులు, దళారుల ఆటలు సాగవని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే దళారులు, అధికారులపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, పొట్టి నేని గోపాలకృష్ణ నాయుడు, సుధాకర్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, మిల్క్ బాలు, సాయి పాల్గొన్నారు.