'రాత్రికి రాత్రి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయలేం'

'రాత్రికి రాత్రి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయలేం'


Web desc : తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ల అరెస్ట్‌ విషయమై కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.

రాత్రికి రాత్రి అరెస్ట్‌లు చేయలేమని ప్రకటించారు. తాజాగా మృతి చెందిన సినీ నిర్మాత కేదార్‌ సెలగమ్‌శెట్టితో కేటీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

'కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమాదాస్పద మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? విచారణ కోరతారా?' అని ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై స్పందించారు.

'రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయి. కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు?' అని ప్రశ్నించారు.

త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామని ప్రకటించారు.

'కేదార్ మృతదేహం స్వదేశం రానుంది. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్‌లోనే ఉన్నారు ఆ ఎమ్మెల్యే ఎవరు?' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులు కేసీఆర్ పక్కన పెట్టారని తెలిపారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

ఉపఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు ఉందని వివరించారు.

'బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? పోటీలో లేని వారు మాట్లాడుతున్నారు. అధ్యక్షుడు ఎవరైనా బీజేపీతోనే పోటీ. బీఆర్ఎస్ బిజెపి గెలుపు కోసం పనిచేస్తుంది.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది' అని రేవంత్‌ రెడ్డి ఇష్టాగోష్టిలో తెలిపారు.

'కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు.

మెట్రోను కేంద్ర మంత్రివర్గం ముందుకు రాకుండా కిషన్‌ రెడ్డి అడ్డుకున్నారు' అని వివరించారు.

Updated On 26 Feb 2025 10:04 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story