పిల్లలను గోదావరిలో తోసి తండ్రి ఆత్మహత్యాయత్నం .. రక్షించిన డ్యూటీ కానిస్టేబుల్

శభాష్ పోలీస్ అన్న

పిల్లలను గోదావరిలో తోసి తండ్రి ఆత్మహత్యాయత్నం .. రక్షించిన డ్యూటీ కానిస్టేబుల్

గోదావరి నదిలో పిల్లలను తోసి తను దూకేందుకు యత్నించిన తండ్రిని కానిస్టేబుల్ రక్షించిన ఘటన నిర్మల్​జిల్లాలో జరిగింది. నిజామాబాద్ లోని బోయిగల్లికి చెందిన కోమటి గంగాప్రసాద్ కు కుటుంబసభ్యులతో తగాదాలు నెలకొన్నాయి.

దీంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకునేందుకు బుధవారం మధ్యాహ్నం బాసర వద్ద గోదావరి నది బ్రిడ్జి పైకి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై వచ్చి దూకేందుకు యత్నించారు.

నిజామాబాద్ వైపు బ్రిడ్జిపైన డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మోహన్ సింగ్ చూసి చాకచక్యంగా వ్యవహరించి కోమటి గంగాప్రసాద్ ను పిల్లలను రక్షించాడు.

అతడికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. బాధితుడి కుటుంబ సభ్యులను పిలిచి ఎస్ఐ గణేశ్ కౌన్సెలింగ్ చేశారు. కానిస్టేబుల్ ను సీఐ మల్లేశ్, ఎస్ఐ గణేశ్, పోలీసులు, స్థానికులు అభినందించారు.

Ck News Tv

Ck News Tv

Next Story