YSRTP భద్రాద్రి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షునిగా శ్రీరాముల వెంకటేశ్వరరావు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు నియామకం.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షునిగా శ్రీరాముల వెంకటేశ్వరరావు.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్),
ఏప్రిల్ 29,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన శ్రీరాముల వెంకటేశ్వరరావుని పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్బంగా తనను నమ్మి కీలకమైన బాధ్యతలు ఇచ్చినటువంటి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలమ్మకు మరియు రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం. రమేష్ కి ధన్యవాదములు తెలియజేసినారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పట్వారిగూడెం మారుమూల ప్రాంతంలో కార్పెంటర్ గా పని చేస్తూ కూడా వైయస్సార్ మీద ఉన్న అభిమానంతో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని షర్మిలమ్మ స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరి సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో పోస్ట్లు పెడుతూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల మన్ననలను పొందుకున్న శ్రీరాముల వెంకటేశ్వరరావుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమించడం పట్ల జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.